దళపతి విజయ్ విలన్‌గా ధనుష్?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-06-15T17:50:08+05:30 IST

‘RRR’ (RRR) సినిమా తర్వాత సౌత్ మల్టీ స్టారర్లు మళ్లీ ఊపందుకున్నాయి. ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలను ఒకే తెరపై చూపించేందుకు పెద్ద దర్శకులంతా ఉత్సాహం చూపుతున్నారు. క్రేజీ స్టార్ హీరోలు సైతం ఇలాంటి చిత్రాల్లో విలన్‌లుగా నటించేందుకు వెనుకాడటం లేదు.

దళపతి విజయ్ విలన్‌గా ధనుష్?

‘RRR’ (RRR) సినిమా తర్వాత సౌత్ మల్టీ స్టారర్లు మళ్లీ ఊపందుకున్నాయి. ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలను ఒకే తెరపై చూపించేందుకు పెద్ద దర్శకులంతా ఉత్సాహం చూపుతున్నారు. క్రేజీ స్టార్ హీరోలు సైతం ఇలాంటి చిత్రాల్లో విలన్‌లుగా నటించేందుకు వెనుకాడటం లేదు. తాజాగా ఈ ఫార్ములాతో కమలహాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించింది. కమల్ తో పాటు తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి విలన్ గా నటించగా, ఫహద్ ఫాజిల్ సినిమాలో సెకండ్ హీరోగా అద్భుతంగా నటించాడు. ఇదిలా ఉంటే అదే ఫార్ములాను తన తదుపరి చిత్రానికి కూడా వర్తింపజేయడానికి దర్శకుడు లోకేష్ సిద్ధమవుతున్నారు.

దళపతి విజయ్‌తో లోకేష్ కనగరాజ్ తదుపరి చిత్రం గురించి చాలా కాలంగా వార్తల్లో ఉంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘మాస్టర్‌’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. తెలుగులో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. విజయ్ కెరీర్ లోనే తమిళనాట అత్యధిక వసూళ్లు రాబట్టింది. అందుకే లోకేష్ తో మరో సినిమా చేసేందుకు విజయ్ రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాలో విలన్ గా విజయ్ ధనుష్ ను ఎంపిక చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. కథ వినగానే ధనుష్‌కి బాగా నచ్చింది. ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ‘ఖైదీ 2’లో అన్నదమ్ములు కార్తీ, సూర్యలను ప్రత్యర్థులను చేసేందుకు సిద్ధమైన లోకేష్ ఇప్పుడు విజయ్, ధనుష్ లను శత్రువులుగా చేసి అభిమానులకు ఆనందాన్ని పంచబోతున్నాడని అంటున్నారు. మరి విజయ్ కి ధనుష్ నిజంగా విలన్ అవుతాడో లేదో చూడాలి.

నవీకరించబడిన తేదీ – 2022-06-15T17:50:08+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *