పూరి కనెక్ట్స్ బాధ్యతలు ఇప్పుడు కూతురికే..?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-06-17T19:29:58+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమా తీసి పూరి జగన్నాథ్ టాలీవుడ్ లో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత డాషింగ్ డైరెక్టర్ గా పక్కా మాస్ ఎంటర్ టైనర్స్ చేస్తున్నాడు

పూరి కనెక్ట్స్ బాధ్యతలు ఇప్పుడు కూతురికే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమా తీసి పూరి జగన్నాథ్ టాలీవుడ్ లో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత పక్కా సాలిడ్ మాస్ ఎంటర్ టైనర్స్ చేస్తూ డాషింగ్ డైరెక్టర్ గా ఎక్స్ ట్రార్డినరీ క్రేజ్ సంపాదించుకున్నాడు. పూరి దర్శకుడిగానే కాకుండా వైష్ణో అకాడమీ మరియు పూరి కనెక్ట్స్ స్థాపించి సొంతంగా సినిమాలు నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పుడు పూరి పవిత్ర టాలీవుడ్‌లో నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా పరిచయమై మెల్లగా తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. తండ్రి దర్శకత్వంలో ‘మెహబూబా’ సినిమాతో హీరోగా మారిన ఆకాష్ ఆ తర్వాత వచ్చి ‘రొమాంటిక్’ సినిమాతో మెప్పించాడు. ఈ సినిమాలు సక్సెస్ కాకపోయినా పెర్ఫార్మెన్స్ పరంగా ఆకాష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పూరీ ప్రెజెన్స్ వల్ల భవిష్యత్తులో ఆకాష్ పెద్ద కమర్షియల్ హీరో అవుతాడని ఇండస్ట్రీ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి.

ఈ క్రమంలోనే పూరీ కూతురు పవిత్ర ప్రొడక్షన్ వైపు అడుగులు వేయనుంది. ప్రస్తుతం ఛార్మితో కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్‌ను స్థాపించిన పూరీ భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ సంస్థ నుంచి ఈ ఏడాది విజయ్ దేవరకొండ-అనన్య పాండేల పాన్ ఇండియా చిత్రం ‘లిగర్’ విడుదల కానుంది. అలాగే విజయ్ దేవరకొండతో పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియన్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. అయితే పవిత్రకు పూరీ కనెక్ట్స్ నిర్మాణ సంస్థ బాధ్యతలు అప్పగించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే క్లారిటీ రానుంది. ఇప్పటికే టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతల వారసులు నిర్మాతలుగా మారిన సంగతి తెలిసిందే.

నవీకరించబడిన తేదీ – 2022-06-17T19:29:58+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *