‘విలేజ్‌లో వినాయకుడు’, కుదిరితే కప్పు కాఫీ’ చిత్రాలను నిర్మించిన మహి వి రాఘవ ‘పాఠశాల’ సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమా రిజల్ట్‌తో పాటు అతని టేకింగ్‌కి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన హారర్ కామెడీ చిత్రం ‘ఆనందోబ్రహ్మ’ మంచి విజయం సాధించింది.

‘విలేజ్‌లో వినాయకుడు’, కుదిరితే కప్పు కాఫీ’ చిత్రాలను నిర్మించిన మహి వి రాఘవ ‘పాఠశాల’ సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమా రిజల్ట్‌తో పాటు అతని టేకింగ్‌కి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన హారర్ కామెడీ చిత్రం ‘ఆనందోబ్రహ్మ’ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వైఎస్ఆర్ పాదయాత్ర కథతో బయోపిక్ గా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా సూపర్ హిట్ కావడంతో దర్శకుడిగా మహి పేరు టాలీవుడ్ లో మారుమోగింది. ఇందులో వైఎస్ఆర్ పాత్రలో నటించిన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి కూడా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా విజయం తెచ్చిన కొత్త ఉత్సాహంతో మహి వి రాఘవ్ ‘యాత్ర’ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు, పాదయాత్ర తదితర అంశాలతో ‘యాత్ర 2’ సినిమా రూపొందుతోందని ప్రచారం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆగిపోయింది.
తాజాగా మహి వి రాఘవ మరో కొత్త కథాంశంతో సినిమా చేస్తున్నాడని టాక్. మూడేళ్ల క్రితం నయనతార నటించిన తమిళ చిత్రం ‘అరమ్’ మంచి విజయం సాధించింది. గోపి నాయనార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో విడుదలైంది. కానీ ఇక్కడ అంత ఆడలేదు. బోరు బావిలో పడిన చిన్నారి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. బాలికను బోరుబావిలో నుంచి బయటకు తీసేందుకు జిల్లా కలెక్టర్ నయనతార తన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించింది అనేది కథ. సినిమా చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. సరిగ్గా ఇదే కథాంశంతో మహి వి రాఘవ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి ప్లాట్‌ని డిఫరెంట్ యాంగిల్‌లో, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించబోతున్నాడని వినికిడి.
నిజానికి ఇలాంటి కథాంశంతో మలయాళంలో 1990లో ‘మాలూట్టి’ అనే సినిమా వచ్చింది. ఇందులో జయరామ్, ఊర్వశి భార్యాభర్తలుగా నటించారు. వీరికి బేబిగా షామిలి నటించింది. బాలిక తన కుక్కతో ఆడుకుంటూ బావిలో పడింది. తన కూతురిని ఇంటికి తీసుకురావడానికి అమ్మాయి తండ్రి కష్టపడాల్సి రావడం కథాంశం. నిజానికి ఈ సినిమా హాలీవుడ్ టీవీ చిత్రం ‘ఎవ్రీబడీస్ బేబీ: ది రెస్క్యూ ఆఫ్ జెస్సికా మెక్‌క్లూర్’కి ఆధారం. ఇప్పుడు అలాంటి కథాంశంతో తెలుగులో ఓ సినిమా రాబోతోంది. దర్శకుడు ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరి ఈ కథ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
నవీకరించబడిన తేదీ – 2022-06-20T14:47:42+05:30 IST