తారక్ – చెర్రీ భాగస్వాములుగా RRR రెస్టారెంట్?

తారక్ – చెర్రీ భాగస్వాములుగా RRR రెస్టారెంట్?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-06-24T00:46:50+05:30 IST

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన క్రేజీ మల్టీస్టారర్ ‘RRR’ (RRR) ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (ఎన్టీఆర్), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (రాంచరణ్) తొలిసారి హీరోలుగా కలిసి నటించారు.

తారక్ - చెర్రీ భాగస్వాములుగా RRR రెస్టారెంట్?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన క్రేజీ మల్టీస్టారర్ ‘RRR’ (RRR) ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (ఎన్టీఆర్), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (రాంచరణ్) తొలిసారి హీరోలుగా కలిసి నటించారు. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్ల కలెక్షన్లు..తెలుగు సినిమా మరోసారి సత్తా చాటింది. ఓటీటీలో కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ‘ఆర్ఆర్ఆర్’ పేరుతో ఓ రెస్టారెంట్ రాబోతోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన నోరూరే వంటకాలు ఈ రెస్టారెంట్ ప్రత్యేకత.

తాజాగా ఓ ప్రముఖ టాలీవుడ్ నిర్మాత యన్టీఆర్, రామ్ చరణ్ లకు ఈ ప్రపోజల్ తీసుకొచ్చాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించాలని సూచించారు. అయితే అది ఏ దేశంలో ఉందో క్లారిటీ లేదు. అంతేకాదు ఇందులో భాగస్వామిగా చేరాలని రాజమౌళికి సలహా ఇచ్చాడు. అయితే తనకు సినిమాలు తప్ప మరే వ్యాపారంపై ఆసక్తి లేదని జక్కన్న చెప్పడంతో.. ప్రస్తుతం తారక్, చెర్రీ ఇద్దరూ తమ తమ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటంతో.. రెస్టారెంట్ బిజినెస్ ఆలోచనను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భవిష్యత్తులో ఈ హీరోలు ఓ రెస్టారెంట్‌ను తెరిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు నిజంగా RRR పేరుతో రెస్టారెంట్‌ను తెరిస్తే. ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతం అనడంలో సందేహం లేదు. రుచికరమైన వంటకాలతో కస్టమర్లను ఆకర్షిస్తే సరిపోతుంది. మరి ఈ వార్తల్లో నిజం ఉందో లేదో చూడాలి.

నవీకరించబడిన తేదీ – 2022-06-24T00:46:50+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *