విజయ్ ‘వారసుడు’లో రీమిక్స్ హిట్ సాంగ్..?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-06-26T20:48:34+05:30 IST

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ హీరోగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త చిత్రం వారసుడు.

విజయ్ 'వారసుడు'లో రీమిక్స్ హిట్ సాంగ్..?

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ హీరోగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త చిత్రం వారసుడు. తాజాగా ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. విజయ్ 66వ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి బ్యానర్‌లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. విజయ్‌కి ఇదే తొలి తెలుగు స్ట్రెయిట్ సినిమా. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా మూడు లుక్‌లను విడుదల చేసిన చిత్రబృందం.. ఇప్పుడు రీమిక్స్ పాటను పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. యూత్ మూవీలోని హిట్ సాంగ్ ‘అల్ తుట్టా బూపతి’ని విజయ్ రీమిక్స్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ పాటను సిమ్రాన్ రాక్ చేసింది. శంకర్ మహదేవన్ పాడారు. తమిళంలో ఈ పాట అప్పట్లో మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇదే పాటను తెలుగులో ప్రభాస్ నటించిన ‘రాఘవేంద్ర’లో ‘కల్కట్ట పనేసిన చూడుకో’ అనే లిరిక్స్‌తో పాడారు. తెలుగులో కూడా ఈ పాట సూపర్ హిట్. ఇప్పుడు ఈ మాస్ సాంగ్ ఒరిజినల్ తమిళ వెర్షన్ ను విజయ్ నటిస్తున్న ‘వారసుడు’లో ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఖచ్చితంగా ఇది ఆల్బమ్‌లో మంచి హిట్ సాంగ్ అవుతుందనడంలో సందేహం లేదు. మరి ఈ పాటలో విజయ్‌తో పాటు ఎవరు పాడనున్నారనే విషయంపై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ఈ సినిమా తమిళంలో ‘వరిసు’ పేరుతో విడుదల కానుంది.

నవీకరించబడిన తేదీ – 2022-06-26T20:48:34+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *