రామ్ – బోయపాటి సినిమా : మరో హీరో నటిస్తున్నాడా?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-06-27T14:28:22+05:30 IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా ఇటీవలే అఫీషియల్‌గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై పవన్ కుమార్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మించబడుతుంది.

రామ్ - బోయపాటి సినిమా : మరో హీరో నటిస్తున్నాడా?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా ఇటీవలే అఫీషియల్‌గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై పవన్ కుమార్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మించబడుతుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియాలో విడుదల కానుంది. ఈ సినిమాని మాస్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించేందుకు దర్శకుడు బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. అతనెవరో కాదు కోలీవుడ్ సక్సెస్ ఫుల్ యువ హీరో శివకార్తికేయన్. ఇప్పటికే శివకార్తికేయన్.. ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వంలో ‘ప్రిన్స్’ అనే డైరెక్ట్ తెలుగు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

రామ్ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా ఈ సినిమా ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. గతేడాది ‘అఖండ’ సినిమాతో బోయపాటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ అనే కాప్ స్టోరీలో నటిస్తున్నాడు. ఎనర్జిటిక్ స్టార్ అయిన రామ్.. బోయపాటి లాంటి సాలిడ్ మాస్ డైరెక్టర్ చేతిలో పడితే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఇప్పటికే రామ్ హిందీ డబ్బింగ్ చిత్రాలతో యూట్యూబ్ లో సంచలనం సృష్టించాడు. ఆయన నటించిన ఫ్లాప్ చిత్రాలకు కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ రావడం గమనార్హం. ఆ క్రేజ్ తోనే బోయపాటి ఈ సినిమాను బాలీవుడ్ లో ప్రత్యేకంగా ప్రమోట్ చేయబోతున్నాడని వినికిడి. త్వరలోనే మిగతా నటీనటుల ఎంపికను ప్రకటిస్తారని.. ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారని టాక్. మరి ఈ సినిమాలో శివకార్తికేయన్ నిజంగా నటిస్తున్నాడో లేదో తెలియాలంటే…కొద్ది రోజులు ఆగాల్సిందే.

నవీకరించబడిన తేదీ – 2022-06-27T14:28:22+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *