ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ‘కందిరీగ’ సినిమాతో సంతోష్ శ్రీనివాస్ టాలీవుడ్‌లో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ‘కందిరీగ’ సినిమాతో సంతోష్ శ్రీనివాస్ టాలీవుడ్‌లో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత రామ్ తో ఆ సినిమాకు సీక్వెల్ తీయాలని కొన్నాళ్లు ప్రయత్నించాడు. అది కుదరకపోవడంతో ఎన్టీఆర్ తో ‘రభస’ సినిమా తీశాడు. సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేదు. ఆ తర్వాత తన మొదటి సినిమా హీరోతో ‘హైపర్’ సినిమా తీశాడు. ఆసక్తికరమైన కథాంశాలతో రూపొందిన ఈ చిత్రం ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయింది. అలా ఒక బ్లాక్ బస్టర్, రెండు ఫ్లాపులతో కెరీర్ ను డ్రాగ్ చేస్తున్న సంతోష్ బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘అల్లుడు అదుర్స్’ సినిమా చేశాడు. ఈ సినిమా కూడా సంతోష్ ఫ్లాప్ లిస్ట్ లోకి చేరిపోయింది.
సో.. వరస ఫ్లాపులతో సరైన ఆకాశాన్ని అందుకోలేకపోతున్న సంతోష్ శ్రీనివాస్ ప్రస్తుతం మెగా మేనల్లుళ్లపై కన్నేశాడు. సాయిధరమ్ తేజ్ లేదా వైష్ణవ్ తేజ్ తో సినిమా తీయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు టాక్. అయితే సాయిధరమ్ ఇప్పుడు తన కెరీర్ ని ఫిక్స్ చేసుకుంటున్నాడు. ఆచితూచి కథలను, దర్శకులను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సంతోష్ శ్రీనివాస్ లాంటి ఫ్లాప్ డైరక్టర్‌ని సాయిధరమ్ అప్రోచ్ అవుతాడా అనేది ప్రశ్న. అలాగే.. వైష్ణవ్ తేజ్ కూడా తన రెండో సినిమాతో ఫ్లాప్ కావడంతో.. ఇక నుంచి కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కొత్త దర్శకులను, విభిన్న కథలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. దాంతో ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్ తో సినిమా చేయడం కూడా కష్టమైపోయింది వైష్ణవ్. మరి సంతోష్ తన తదుపరి చిత్రాన్ని ఏ హీరోతో చేస్తాడో చూడాలి.
నవీకరించబడిన తేదీ – 2022-07-01T16:48:16+05:30 IST