కార్తికేయ 2 : రిలీజ్ వాయిదా?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-07-03T20:23:48+05:30 IST

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటిస్తున్న తాజా చిత్రం ‘కార్తికేయ 2’. సూపర్ హిట్ సినిమా ‘కార్తికేయ’కి ఇది సీక్వెల్ అనే సంగతి తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

కార్తికేయ 2 : రిలీజ్ వాయిదా?

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటిస్తున్న తాజా చిత్రం ‘కార్తికేయ 2’. సూపర్ హిట్ సినిమా ‘కార్తికేయ’కి ఇది సీక్వెల్ అనే సంగతి తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మల్లు బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా, సత్య, శ్రీనివాసరెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సముద్రం దాచిన ద్వారకా నగరం వెనుక రహస్యాన్ని కనుగొనే కథాంశంతో సినిమా తెరకెక్కింది. నిజానికి ఈ కథాంశంతో గతంలో వెంకటేష్ నటించిన ‘దేవిపుత్రుడు’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. చైల్డ్ సెంటిమెంట్ తో సోషియో ఫాంటసీగా రూపొందిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇప్పుడు మళ్లీ అదే కథాంశంతో ఈ సినిమా థ్రిల్లర్ కాన్సెప్ట్‌గా రాబోతోంది. జూలై 22న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతోందని సమాచారం. ఆగస్ట్‌లో చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

నవీకరించబడిన తేదీ – 2022-07-03T20:23:48+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *