DJ Tillu 2: ఇదే కీలక మార్పు!

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-07-04T16:38:53+05:30 IST

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్ ‘డీజే టిల్లు’. నూతన దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు సిద్దు జొన్నల గద్దె అందించారు.

DJ Tillu 2: ఇదే కీలక మార్పు!

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్ ‘డీజే టిల్లు’. నూతన దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు సిద్దు జొన్నల గద్దె అందించారు. ఈ సినిమా యూత్‌ని విశేషంగా ఆదరించింది. ముఖ్యంగా టిల్లు పాత్రధారి సిద్ధు జొన్నలగడ్డ డైలాగ్స్ మరియు అతని నటన ప్రేక్షకులకు బాగా నచ్చింది. పాటలు కూడా ఈ సినిమా విజయానికి ఎంతగానో దోహదపడ్డాయి. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు రాబట్టింది.

హైదరాబాద్ లోకల్ స్లాంగ్ తో డీజే టిల్లుగా చెలరేగిన సిద్ధు జొన్నలగడ్డ.. ఈ సినిమా విజయం సాధించడంతో ఈ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. దీనికి కూడా ఆయనే కథ, మాటలు అందిస్తున్నారు. మరో విశేషమేమిటంటే.. సీక్వెల్ కోసం తొలిసారిగా మెగాఫోన్ పట్టబోతున్నాడు. అలాగే.. ఈ సినిమాలో కీలక మార్పు కూడా జరగనుంది. అదేమిటంటే.. సెకండ్ పార్ట్ లో హీరోయిన్ మారుతోంది. తొలి భాగంలో అద్భుతంగా నటించిన నేహా శెట్టి అతిథి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని కూడా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనుంది.

ప్రస్తుతం క్రేజీ గ్లామర్ హీరోయిన్ కోసం టీమ్ వెతుకుతోంది. మొదటి భాగంలోని కొన్ని పాత్రలు రెండవ భాగంలో కొనసాగుతాయి. మరి కొన్ని పాత్రలు వచ్చి చేరతాయి. వాటిలో హీరోయిన్‌దే ప్రధాన పాత్ర. రాధిక అనే అమ్మాయితో ప్రేమలో పడిన టిల్లూ అనుకోకుండా ఆమె హత్యలో చిక్కుకుంటాడు. చివరికి ఈ హత్య కేసు నుంచి ఎలా బయటపడతాడు? అన్నది మిగతా ప్లాట్. మరి థియేటర్లలోనే కాదు ఓటీటీలో దుమ్ము రేపిన ఈ సినిమా సీక్వెల్ కు సిద్ధు జొన్నలగడ్డ ఎలాంటి కథ రాస్తాడో చూడాలి.

నవీకరించబడిన తేదీ – 2022-07-04T16:38:53+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *