యాంకర్‌గా బుల్లితెరను, నటిగా వెండితెరను బ్యాలెన్స్ చేస్తున్న అనసూయ భరద్వాజ్ ప్రతిభ. ఈ ఏడాది సినిమాల పరంగా స్పీడ్ పెంచుతోంది. విభిన్న ప్రాజెక్టులతో బిజీగా ఉండబోతున్నారు.

యాంకర్‌గా బుల్లితెరను, నటిగా వెండితెరను బ్యాలెన్స్ చేస్తున్న అనసూయ భరద్వాజ్ ప్రతిభ. ఈ ఏడాది సినిమాల పరంగా స్పీడ్ పెంచుతోంది. విభిన్న ప్రాజెక్టులతో బిజీగా ఉండబోతున్నారు. ఈ కారణంగానే ఆమె ‘జబర్దస్త్’ కామెడీ షో నుండి యాంకర్‌గా తప్పుకున్నట్లు తెలుస్తోంది. కృష్ణవంశీ మంచి పాత్రలో ఆమె నటించిన ‘రంగమార్తాండ’ చిత్రం త్వరలో సిద్ధమవుతుండగా… ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో మెగాస్టార్ ఓ కీలక పాత్ర చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. త్వరలో ‘పుష్ప 2’ షూటింగ్‌కి సిద్ధమవుతోంది అనసూయ. మరెన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఓ సినిమాలో అనసూయ వేశ్య పాత్రలో నటిస్తోందని టాక్స్ వినిపిస్తున్నాయి.
ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి త్వరలో గురజాడ అప్పారావు రచించిన ‘కన్యాశుల్కం’ నాటకాన్ని వెబ్ సిరీస్‌గా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో మధురవాణిగా అనసూయను ఎంచుకున్నాడు క్రిష్. ఆ పాత్ర కోసం చాలా మందిని అనుకున్నారు. అయితే ఫైనల్ గా అనసూయ ఎంపికైంది. మంచి పాత్ర అని అనసూయ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గతంలో ఎన్టీఆర్ హీరోగా ఈ నాటకం సినిమా వచ్చింది. ఇందులో గిరీష్ గా యన్టీఆర్ నటించగా.. మధురవాణిగా సావిత్రి నటించారు. మహానటి అప్పట్లో అద్భుతంగా చేసిన పాత్రనే ఇప్పుడు అనసూయ చేయబోతుండటం విశేషం.
క్రిష్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడు. తనతో పాటు పలు చిత్రాలకు పనిచేసిన ఓ సహాయ దర్శకుడికి ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించే బాధ్యతను అప్పగించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. త్వరలో ‘కన్యాశుల్కం’ వెబ్ సిరీస్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
నవీకరించబడిన తేదీ – 2022-07-04T15:20:18+05:30 IST