భోళా శంకర్: విడుదలకు మెగాస్టార్ ప్లాన్..?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-07-07T14:45:44+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ చిత్రంలో నటిస్తున్నారు.

భోళా శంకర్: విడుదలకు మెగాస్టార్ ప్లాన్..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తమిళ సూపర్ హిట్ మూవీ ‘వేదాళం’కి అఫీషియల్ రీమేక్‌గా రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో తెలుగు నేటివిటీకి, మెగాస్టార్ ఇమేజ్‌కి తగ్గట్టుగా కథలో కొన్ని కీలక మార్పులు చేశారు.

భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. చిరు చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుంది. అయితే ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ ప్లాన్ మారినట్లు తెలుస్తోంది. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌కి రీమేక్‌గా రూపొందుతున్న గాడ్ ఫాదర్‌లో చిరు పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలై సూపర్‌ రెస్పాన్స్‌ తెచ్చుకుంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార, సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాథ్, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఆ తర్వాత యువ దర్శకుడు బాబీతో మెగాస్టార్ 154వ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, మెగాస్టార్ ఊర మాస్ పాత్రలో నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం 2023 సంక్రాంతికి విడుదల కానుంది. అయితే మెహర్ రమేష్ తో మెగాస్టార్ చేస్తున్న భోళా శంకర్ సినిమాను వచ్చే ఏడాది ఉగాది రోజున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇదే నిజమైతే దసరా, సంక్రాంతి, ఉగాది పండుగలకు భారీ మెగా ట్రీట్ ఉండబోతోందని ఫిక్సయిపోవచ్చు.

నవీకరించబడిన తేదీ – 2022-07-07T14:45:44+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *