బింబిసార: రెండు తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులు ఆయనకే..?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-07-09T14:16:01+05:30 IST

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం బింబిసార. తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగులోనే

బింబిసార: రెండు తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులు ఆయనకే..?

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం బింబిసార. తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ హక్కులను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సొంతం చేసుకున్నారు. 2020లో వచ్చిన ఎంత మంచివాడవురా తర్వాత కళ్యాణ్ రామ్ మళ్లీ సినిమాతో రాలేదు.. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో, కాస్త ఆలస్యమైనా హిట్ కథతో రావాలని కళ్యాణ్ రామ్ గట్టిగా నిర్ణయించుకున్నాడు.

ఆ ఆలోచనతోనే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ట్రెండ్‌ను అనుసరించి బింబిసార చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యున్నత సాంకేతిక విలువలతో ఎన్టీఆర్ ఆర్ట్స్ (ఎన్టీఆర్ ఏటీఆర్స్) పతాకంపై కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో త్రిగర్తల రాజ్యానికి ప్రభువైన బింబిసారుడిగా కనిపించనున్నాడు. యువ దర్శకుడు మల్లిడి వశిష్ట్ తొలిసారిగా మెగా ఫోన్‌తో తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్ సాధించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

దీంతో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు బింబిసార రెండు తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను దక్కించుకున్నాడు. ఇందుకోసం భారీ మొత్తం చెల్లించినట్లు టాక్. ఈ చిత్రంలో కేథరిన్ త్రెసా, సంయుక్త మీనన్, వరినా హుస్సేన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆగస్ట్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.చిరంతన్ భట్ సంగీతం, ఎంఎం కీరవాణి నేపథ్య సంగీతం. మరి ఈ సినిమా కళ్యాణ్ రామ్ ఆశిస్తున్న భారీ విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

నవీకరించబడిన తేదీ – 2022-07-09T14:16:01+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *