అఖిల్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్..?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-07-09T15:15:22+05:30 IST

అక్కినేని అఖిల్ హీరోగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని తాజా సమాచారం. ‘మనం’ సినిమాలో చిన్న పాత్రతో మెప్పించాడు అక్కినేని.

అఖిల్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్..?

అక్కినేని అఖిల్ హీరోగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని తాజా సమాచారం. ‘మనం’ సినిమాలో చిన్న పాత్రతో అక్కినేనిని మెప్పించిన అఖిల్ ఆ తర్వాత హీరోగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. వరుసగా మూడు ఫ్లాపుల తర్వాత అఖిల్ తన నాలుగో సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నాడు. అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది.

అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ లుక్ పూర్తిగా మార్చేసి కొత్త లుక్ లో కనిపించాడు. హెయిర్ స్టైల్, సిక్స్ ప్యాక్ బాడీ పూర్తిగా మారిపోయింది. ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాల కోసం అఖిల్ కూడా చాలా కష్టపడుతున్నాడు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 12న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ సినిమా తర్వాత అఖిల్ హీరోగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్.

‘రౌడీ బాయ్స్’, ‘ఎఫ్3’ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్న దిల్ రాజు, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య, రాశీఖన్నా నిర్మించిన చిత్రం ‘థ్యాంక్యూ’. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలో అఖిల్ తో ఓ సినిమా కూడా ప్లాన్ చేశారు. ‘వకీల్ సాబ్’ చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. దిల్ రాజు నిర్మించే సినిమా అఖిల్ కి గ్యారెంటీ హిట్ అని భావించవచ్చు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడొస్తుందో చూడాలి.

నవీకరించబడిన తేదీ – 2022-07-09T15:15:22+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *