నితిన్: పాపులర్ సీరియల్స్‌లోకి ఎంట్రీ?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-07-12T16:27:18+05:30 IST

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ‘మాచర్ల నియోజకవర్గం’ అనే పొలిటికల్ థ్రిల్లర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

నితిన్: పాపులర్ సీరియల్స్‌లోకి ఎంట్రీ?

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ‘మాచర్ల నియోజకవర్గం’ అనే పొలిటికల్ థ్రిల్లర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. నితిన్ ఐఏఎస్ అధికారిగా కొత్త గెటప్‌తో అలరించబోతున్న ఈ సినిమా ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, కేథరిన్ ట్రెస్సా కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ వినూత్నంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే నితిన్ ప్రముఖ సీరియల్స్ లో క్యామియో రోల్స్ చేయబోతున్నట్లు సమాచారం.

సినిమా ప్రమోషన్ల కోసం స్టార్ హీరోలు పాపులర్ సీరియల్స్‌లో కనిపించడం బాలీవుడ్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రముఖ సీరియల్ ‘సీఐడీ’లో బాలీవుడ్ స్టార్ హీరోలు కనిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు పాపులర్ సీరియల్స్‌లో కూడా నితిన్ క్యామియో అప్పియరెన్స్ ఇవ్వబోతున్నాడని సమాచారం. ఇప్పుడు ఈ వార్త అభిమానుల్లో ఉత్కంఠను నింపుతోంది. అయితే నితిన్‌ ఏ సీరియల్‌లో నటిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.

గతేడాది ‘చెక్’, ‘రంగదే’ చిత్రాలతో వరుస పరాజయాలను చవిచూసిన నితిన్.. ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. దీని ప్రకారం ఇందులో ఆయన పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందని నిర్మాతలు చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన సింగిల్స్, టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అతి త్వరలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. అంజలి స్పెషల్ సాంగ్ ఈ సినిమాకే హైలెట్ కానుందని తెలుస్తోంది. మరి నితిన్ ఏ సీరియల్‌లో కనిపిస్తాడో చూడాలి.

నవీకరించబడిన తేదీ – 2022-07-12T16:27:18+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *