SSMB29 : మీరు సెట్‌పైకి రాగానే..?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-07-15T13:51:26+05:30 IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కార్ వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో

SSMB29 : మీరు సెట్‌పైకి రాగానే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కార్ వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

దీనికి సంగీత సంచలనం ఎస్ఎస్ థమన్ స్వరపరిచారు. అయితే ఈ సినిమా తర్వాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో మహేష్ భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. ఇది అతని కెరీర్‌లో 29వ చిత్రం. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇక ఈ సినిమా భారీ స్టార్ కాస్టింగ్ తో శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత డా.కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

అయితే ఈ సినిమాను అడ్వెంచరస్ బ్యాక్‌డ్రాప్‌లో రాజమౌళి నిర్మించనున్నారు. ఇక, ఈ భారీ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి నుంచి సెట్స్ పైకి తీసుకురానున్నారు. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్‌తో సినిమా కథపై వర్క్ స్టార్ట్ చేసిన రాజమౌళి ఈ వర్క్ పూర్తి కాగానే ఫుల్ బౌండడ్ స్క్రిప్ట్‌పై దృష్టి పెట్టనున్నారు. ఇదిలా ఉంటే, 2023 ప్రారంభంలో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి, వేసవి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 3 ఏళ్ల పాటు ఈ సినిమా కోసం మహేష్ వర్క్ చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మహేష్-రాజమౌళి సినిమాపై అంచనాలు అసాధారణంగా ఉన్నాయి.

నవీకరించబడిన తేదీ – 2022-07-15T13:51:26+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *