యశోద: సమంత నుండి మరో సర్ప్రైజ్?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-07-17T18:56:10+05:30 IST

సమంతా సౌత్‌లో టాలెంటెడ్ బ్యూటీ మరియు అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా వెలుగొందుతోంది. ప్రస్తుతం సామ్.. పలు చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తోంది. అందులో ఒకటి మహిళా ప్రధాన చిత్రం ‘యశోద’.

యశోద: సమంత నుండి మరో సర్ప్రైజ్?

సమంతా సౌత్‌లో టాలెంటెడ్ బ్యూటీ మరియు అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా వెలుగొందుతోంది. ప్రస్తుతం సామ్.. పలు చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తోంది. అందులో ఒకటి మహిళా ప్రధాన చిత్రం ‘యశోద’. హరి-హరీష్ దర్శక ద్వయం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో పాన్-ఇండియా విడుదల కానుంది. మలయాళ యంగ్ హీరో ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటిస్తుండగా.. మురళీ శర్మ, రావు రమేష్, వరలక్ష్మి శరత్ కుమార్, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పిక గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో సమంతపై ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో పాట చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. ‘పుష్ప’ చిత్రం కోసం సమంత తొలిసారిగా డ్యాన్స్ చేసిన ‘ఊ అంటావా మావా ఊఓ అంటావా మావా’ పాట కంటే ఈ పాట స్పైసీగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో సమంత యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొని అభిమానులను ఆశ్చర్యపరిచే విధంగా యాక్షన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. యాక్షన్ సన్నివేశాల కోసం సమంత ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటుంది. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘యశోద’ రూపొందుతోంది.

గతంలో విడుదలైన ‘యశోద’ టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ఇప్పటి వరకు సామ్ పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుందని, అదే సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని వార్తలు వచ్చాయి. దీనికి ముందు సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ ప్రస్తుతం సీజీ వర్క్ జరుపుకుంటోంది. ఈ సినిమా విడుదలకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే అంతకంటే ముందే.. ‘యశోద’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరి ‘యశోద’గా సామ్ అభిమానులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

నవీకరించబడిన తేదీ – 2022-07-17T18:56:10+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *