మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 154వ చిత్రంగా ‘వాల్తేరు వీరయ్య’ (వర్కింగ్ టైటిల్) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 154వ చిత్రంగా ‘వాల్తేరు వీరయ్య’ (వర్కింగ్ టైటిల్) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమిళ బ్యూటీ శృతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించబడింది. ప్రస్తుతం చిరు, రవితేజలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
మెగా 154 సినిమా గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంటే. ఈ సినిమాతో సుమలత రీఎంట్రీ ఇవ్వబోతుందనే టాక్ వినిపిస్తోంది. అప్పట్లో సుమలత అందాల అభినయానికి, నటనకే వన్నె తెచ్చే అందానికి ప్రతిరూపంగా నిలిచింది. చిరంజీవి సరసన ఆమె నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తెలుగులో అల్లు శిరీష్ నటించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ ఆమె చివరి చిత్రం. ఆ తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. దాదాపు ఆరేళ్ల తర్వాత మెగాస్టార్‌తో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రవితేజ తల్లిగా సుమలత నటిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఇప్పటికే ఈ సినిమా సెట్స్‌పై రవితేజ బిజీగా ఉన్నాడు. త్వరలో సుమలత కూడా షూటింగ్‌లో జాయిన్ కానుందని సమాచారం. రవితేజతో ఆమె సన్నివేశాలు ఎమోషనల్‌గా హత్తుకునేలా ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమాలో రవితేజ పాత్ర చనిపోతుందని, ఆ పాత్ర మరణంతో చిరు క్యారెక్టర్ మారుతుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో వీరిద్దరూ అండర్‌కవర్ పోలీసులుగా నటిస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. వాల్తేరు బీచ్ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన కథాంశాలతో రూపొందిన ఈ చిత్రం అభిమానులకు మంచి మాస్ ఫీస్ట్‌ని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
నవీకరించబడిన తేదీ – 2022-07-19T16:29:25+05:30 IST