సౌత్ ప్రేక్షకులు లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకునే ఏకైక బ్యూటీ నయనతార. దాదాపు అన్ని భాషల్లోనూ ప్రముఖ, మిడ్ రేంజ్ హీరోలతో జోడీ కట్టిన ఈ బ్యూటీ ఇప్పటికీ క్రేజీ స్టార్ డమ్ మెయింటెన్ చేయడంలో ఆశ్చర్యం లేదు.

సౌత్ ప్రేక్షకులు లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకునే ఏకైక బ్యూటీ నయనతార. దాదాపు అన్ని భాషల్లో లీడింగ్, మిడ్ రేంజ్ హీరోలతో జోడీ కట్టిన ఈ బ్యూటీ ఇప్పటికీ క్రేజీ స్టార్ డమ్ మెయింటెన్ చేయడంలో ఆశ్చర్యం లేదు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. నయన్ ఇటీవల తన ప్రియుడు, తమిళ దర్శకుడు, నిర్మాత విఘ్నేష్ శివన్‌ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే తన కమిట్ మెంట్స్ ని నెరవేర్చుకోవడానికి ఆమె రీసెంట్ గా రంగంలోకి దిగడం వారికి కాస్త ఊరటనిచ్చే అంశం.
ఇక అసలు విషయానికి వస్తే నయనతార తన పారితోషికాన్ని ఓ రేంజ్ లో పెంచేసిందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పెళ్లి తర్వాత వైవిధ్యమైన కథలను మరింత ఉత్సాహంగా ఎంచుకోవడమే కాకుండా.. జీతం కూడా పెంచడం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ‘జవాన్’ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నయనతార కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం నయన్.. ఏకంగా రూ. 7 కోట్ల పారితోషికం అందుకున్నట్లు వినికిడి. అయితే ఆమె తదుపరి నటించబోయే లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఏకంగా రూ. 10 కోట్లు డిమాండ్ చేశారు. ఆమె అడిగిన మొత్తం ఎక్కువే అయినా.. ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు బేరం లేకుండా ఒప్పుకున్నారు. నయనతారకు ఇది 75వ సినిమా కావడం కూడా అందుకు కారణం.
నయనతార పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళ చిత్రం ‘గోల్డ్’, ‘ఇరైవన్’ మరియు ‘కనెక్ట్’ తమిళ చిత్రాలలో నటిస్తోంది, మెగాస్టార్ చిరంజీవి యొక్క ‘గాడ్ ఫాదర్’, ఆమె 75వ చిత్రం. . ఈ సినిమాలన్నీ ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి. వీటిలో నయనతార ‘కనెక్ట్’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తోంది. మరి ఈ సినిమాలన్నీ సూపర్ హిట్ అయితే నయన్ తన పారితోషికాన్ని ఇంకా ఎంత పెంచుకుంటుందో చూడాలి.
నవీకరించబడిన తేదీ – 2022-07-20T17:02:54+05:30 IST