ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ‘లైగర్’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది.

ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ‘లైగర్’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.బాక్సింగ్ నేపథ్యంలో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ఇందులో ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ తండ్రిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాలున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే విజయ్, పూరి కాంబినేషన్‌లో రెండో సినిమాగా జంగనమన (జేజీఎం)ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘లైగర్’ సినిమా విడుదలైన తర్వాత.. జేజీఎం సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.
‘జగగణమన’ సినిమా తర్వాత విజయ్, పూరీ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అభిమానులను అలరించే వెరైటీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. కాకపోతే ఈసారి జోనర్‌ని మార్చబోతున్నారు. ‘యమదొంగ’ తరహాలో ఓ ఫాంటసీ కథనంతో అభిమానులను అలరించబోతున్నారని వినికిడి. ‘దేవాంతకుడు, యమగోల, యముడి మొగుడు, మళ్లీ యమగోల మొదలైంది, యమజాతకుడు, యమయనమః’ వంటి చిత్రాలు ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈసారి రౌడీ హీరో యమలోకంలో ప్రభంజనం సృష్టించబోతున్నాడనే చెప్పాలి.
పూరీ జగన్నాథ్ గతంలో రవితేజ, ఇలియానా జంటగా ‘దేవుడుచేసిన మనుషులు’ అనే ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. విష్ణువుగా బ్రహ్మానందం, లక్ష్మీదేవిగా కోవై సరళ నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అంతగా ఆడలేదు కానీ పూరి కెరీర్‌లో డిఫరెంట్ మూవీగా నిలిచింది. ఇప్పుడు మరోసారి పూరీ జగన్నాథ్ ఫాంటసీ సినిమా చేయబోతున్నాడు. ‘జగగణమన’ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రాథమిక కథాంశాన్ని పూరి ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా పాన్ ఇండియాలో రూపొందనుంది. మరి ఈ యమ ఫాంటసీ విజయ్ కి ఏ మేరకు సెట్ అవుతుందో చూడాలి.
నవీకరించబడిన తేదీ – 2022-07-20T20:28:29+05:30 IST