సీతా రామం: ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి అతిథులు ఎవరు?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-07-26T19:27:32+05:30 IST

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో వరుసగా రెండో సినిమా ‘సీతా రామం’. యుద్ధంతో రాసిన ప్రేమకథ దీనికి ట్యాగ్ లైన్. త్వరలో జరగనున్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం

సీతా రామం: ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి అతిథులు ఎవరు?

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో వరుసగా రెండో సినిమా ‘సీతా రామం’. యుద్ధంతో రాసిన ప్రేమకథ దీనికి ట్యాగ్ లైన్. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌లు ఖరారైనట్లు తాజా సమాచారం. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండగా, మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కీలక పాత్రలో నటిస్తోంది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 5న థియేటర్లలో విడుదల కానుంది.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం వెర్షన్లలో విడుదల చేయనున్నారు. గతంలో విడుదలైన ఈ సినిమా టీజర్, సింగిల్స్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ప్రకాష్ రాజ్, తరుణ్ భాస్కర్, మురళీ శర్మ, సుమంత్, భూమిక ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో ఎక్కువ భాగం కాశ్మీర్‌లో చిత్రీకరించారు. అయితే ఈ సినిమా ఆగస్ట్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా త్వరలో నిర్వహించనున్న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పాన్ ఇండియన్ స్టార్స్ ప్రభాస్, ఎన్టీఆర్ హాజరు కానున్నారు. వీరిద్దరూ వైజయంతీ మూవీస్ సంస్థలో సినిమాలు చేశారు. గతంలో ఎన్టీఆర్‌తో ‘శక్తి’ చిత్రాన్ని నిర్మించగా ఇప్పుడు ప్రభాస్‌తో ‘ప్రాజెక్ట్‌ కే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ బాండింగ్‌తో ‘సీతారాం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌లుగా రావాలని మేకర్స్ కోరగా.. ఎన్టీఆర్, ప్రభాస్ ఒప్పుకున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

నవీకరించబడిన తేదీ – 2022-07-26T19:27:32+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *