సీతా రామం సినిమాలో నటించిన మృణాల్ ఠాకూర్ గురించే సర్వత్రా చర్చ జరుగుతోంది. దాంతో ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ.

సీతా రామం సినిమాలో నటించిన మృణాల్ ఠాకూర్ గురించే సర్వత్రా చర్చ జరుగుతోంది. దాంతో ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారాములు సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. చాలా గ్యాప్ తర్వాత దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కీలక పాత్రలో నటించింది.
ఇందులో నటించిన నటీనటులతో పాటు సినీ ప్రముఖులు దర్శక, నిర్మాతలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా, మృణాల్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మరియు పరిశ్రమ వర్గాలను ఆకట్టుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆమెను పొగడకుండా ఉండలేరు. దాంతో మృణాల్ టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లోనే హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఆమెకు ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశం వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఆ సినిమా ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ ఎవరనే విషయంపై గత కొన్ని రోజులుగా చాలా పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఎట్టకేలకు ఎన్టీఆర్ 30లో తారక్ సరసన హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ని ఎంపిక చేసే పనిలో పడ్డారు.దాదాపు ఆమెనే మేకర్స్ ఫైనల్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఆమె టాలీవుడ్‌లో సెట్ అవ్వక తప్పదు.
నవీకరించబడిన తేదీ – 2022-08-11T18:58:59+05:30 IST