మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ మరో స్ట్రెయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో అవుననే మాట బలంగా వినిపిస్తోంది. మహానటి సినిమాతో టాలీవుడ్‌కి

మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ మరో స్ట్రెయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో అవుననే మాట బలంగా వినిపిస్తోంది. దుల్కర్ సల్మాన్ మహానటి సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన సీతా రామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో దుల్కర్ సల్మాన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది చిత్రబృందం. ఇదిలా ఉంటే దుల్కర్ మరో టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దుల్కర్ కోసం శేఖర్ కమ్ముల అద్భుతమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. కోలీవుడ్ స్టార్ ధనుష్ తో శేఖర్ కమ్ముల ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడి చాలా నెలలు కావస్తోంది.
అయితే ధనుష్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. దీని తర్వాత శేఖర్ కమ్ముతో సినిమా చేయనున్నాడు. ఈ గ్యాప్‌లో దుల్కర్ సల్మాన్‌తో సినిమా పూర్తి చేయాలని శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నాడు. ధనుష్ ‘సర్’ సినిమాను పూర్తి చేయకముందే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
నవీకరించబడిన తేదీ – 2022-08-19T19:03:04+05:30 IST