లిగర్: ఈ జోరు కొనసాగుతుందా..? | లిగర్ ఈ జోరు కొనసాగుతుందా grk-MRGS-చిత్రజ్యోతి

లిగర్..ఇప్పుడు ఈ సినిమా అందరి చూపు మీదే ఉంది. దాదాపు రెండేళ్లుగా రూపొందుతున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెల 25న భారీ ఎత్తున విడుదల కానుంది. విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ఇది. అయితే ఈమధ్య వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అదేంటంటే.. ఈ ఏడాది మార్చిలో వచ్చిన RRR, KGF 2 సినిమాల తర్వాత జూన్ వరకు ఆ రేంజ్ హిట్స్ కానీ, ఊపు కానీ కనిపించలేదు. కానీ, ఈ ఏడాది ద్వితీయార్థంలో మంచి ఊపు ఉంది. సీతా రామం, కార్తికేయ 2 మరియు బింబిసార చిత్రాలు తెలుగు చిత్ర పరిశ్రమ కొత్త ఊపును ప్రారంభించాయని చూపుతున్నాయి.

భారీ అంచనాల నడుమ వచ్చిన రాధే శ్యామ్, ఆచార్య, సర్కార్ వారి పాట, పక్కా కమర్షియల్ వంటి పెద్ద సినిమాలు మొదటి సగంలో RRR మరియు KGF 2 తెచ్చిన ఊపును నిలబెట్టుకోలేకపోయాయి. అందుకే ఇప్పుడు లిగర్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. సీతారాం, కార్తికేయ 2, బింబిసార చిత్రాలు అందరి అంచనాలను ఫలించాయి. ఈ క్రమంలో ఆగస్ట్ 25న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో లిగర్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్ప‌టికే ఈ సినిమాపై వ‌చ్చిన వ‌న్నీ అంచ‌నాల‌ను పెంచేశాయి.

ఈ అంచనాలను రెట్టింపు చేస్తూ లిగర్ టీమ్ సౌత్ మరియు నార్త్‌లో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. పూరి సినిమా పెద్ద హిట్ అవుతుంది. లేదా ఒక్క షోతో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటుంది. అందుకే ఇండస్ట్రీలో ఇప్పుడున్న జోరును పూరి లిగర్ కూడా కంటిన్యూ చేస్తాడా అని మాట్లాడుకుంటున్నారు. మరి ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే సౌత్ లో హీరోయిన్ గా అరంగేట్రం చేస్తోంది. రమ్యకృష్ణ, మైక్ టైసన్, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

నవీకరించబడిన తేదీ – 2022-08-19T16:23:18+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *