మాస్ మహారాజా రవితేజకి హిట్ ఇచ్చే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా..? అంటే సరైన సమాధానం లేదు. వరుస ఫ్లాపుల తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ మహారాజా.

మాస్ మహారాజా రవితేజకి హిట్ ఇచ్చే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా..? అంటే సరైన సమాధానం లేదు. వరుస ఫ్లాపుల తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన కిరాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు ఈ మాస్ మహారాజా. దర్శకుడికి, హీరో హీరోయిన్లుగా నటించిన రవితేజ, శృతిహాసన్‌లకు మూడేళ్ల తర్వాత ఈ సినిమా హిట్. ఈ సినిమా తర్వాత ముగ్గురూ బిజీ అయిపోయారు. ముఖ్యంగా రవితేజ అరడజను సినిమాలను లైన్లో పెట్టాడు.
అయితే క్రాక్ తర్వాత భారీ అంచనాల నడుమ వచ్చిన ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. మాస్ మహారాజా ఫ్లాప్ అవ్వడానికి కారణం అదే రొట్టకొట్టుడు రొటీన్ కథలను ఎంచుకోవడం వల్లనే అని సినిమాలు చూసిన ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. రవితేజ నటనలో కొత్తదనం లేదనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. ఆయనతో సినిమాలు తీస్తున్న దాదాపు దర్శకులందరూ రవితేజకు ఉన్న మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని మాస్ కథలు రాస్తున్నారు తప్ప వినూత్నంగా ప్రయత్నించడం లేదు.
ఇప్పుడు రవితేజకు వైవిధ్యమైన కథతో హిట్ అందించనున్న దర్శకుడు ఎవరని ఆయన అభిమానులు మాట్లాడుకుంటున్నారు. నిజానికి పాన్-ఇండియా సినిమా ట్రెండ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఆ క్రేజ్ కోసమే హీరోలంతా పాకులాడుతున్నారు. కానీ మన మాస్రాజు మాత్రం ఆ మాస్ స్టోరీలను పట్టుకుని ఉన్నాడు. ధమాకా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్. ఇది అతని మార్క్ మాస్ సినిమా కూడా. అలాగే వంశీకృష్ణ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా సినిమా. రావణాసుర అనే మరో మాస్ ఎంటర్‌టైనర్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవితో కలిసి మెగా 154లో నటిస్తున్నాడు. మరి వీరిలో రవితేజకు ఏ దర్శకుడు భారీ హిట్ ఇస్తాడో చూడాలి.
నవీకరించబడిన తేదీ – 2022-08-27T17:19:02+05:30 IST