యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ పీజీ

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ పీజీ

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UOH) – ఇంటిగ్రేటెడ్ PG ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఇంటిగ్రేటెడ్ M.Sc., ఇంటిగ్రేటెడ్ MA ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్ కాలవ్యవధి ఐదేళ్లు. కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) 2022 మెరిట్ జాబితా కోర్ పేపర్లలో పొందిన స్కోర్ ఆధారంగా తయారు చేయబడుతుంది. క్వాలిఫైయింగ్ పేపర్లలో కటాఫ్ మార్కులు వచ్చాయో లేదో సరిచూసుకుని కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్లు ఇస్తారు.

ప్రత్యేకతలు – సీట్లు

  • ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీలో మ్యాథమెటికల్ సైన్సెస్ 20, ఫిజిక్స్ 20, కెమికల్ సైన్స్ 20, బయాలజీ 20, అప్లైడ్ జియాలజీ 10, హెల్త్ సైకాలజీ 20 సీట్లు ఉన్నాయి.
  • ఇంటిగ్రేటెడ్ ఎంఏలో తెలుగు 19, హిందీ 10, లాంగ్వేజ్ సైన్సెస్ 19, ఉర్దూ 10, ఎకనామిక్స్ 14, హిస్టరీ 13, పొలిటికల్ సైన్స్ 13, సోషియాలజీ 14, ఆంత్రోపాలజీ 13 సీట్లు ఉన్నాయి.
  • ఇంటిగ్రేటెడ్ ఎం. ఆప్టోమెట్రీలో 28 సీట్లు ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ కాలవ్యవధి ఆరేళ్లు.

అర్హత: ఇంటిగ్రేటెడ్ M.Sc., ఇంటిగ్రేటెడ్ M. ఆప్టోమెట్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి, మ్యాథమెటిక్స్/ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్/ XII/ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటిగ్రేటెడ్ ఎంఏలో ప్రవేశానికి ఏదైనా గ్రూప్‌తో ఇంటర్/ XII పూర్తి చేసి ఉండాలి. లాంగ్వేజ్ స్పెషలైజేషన్ల కోసం సంబంధిత భాషనే ప్రధాన సబ్జెక్టుగా అధ్యయనం చేయాలి. అభ్యర్థులందరికీ ఇంటర్ స్థాయిలో ఫస్ట్ క్లాస్ మార్కులు తప్పనిసరి.

ముఖ్యమైన సమాచారం

దరఖాస్తు రుసుము: సాధారణ అభ్యర్థులకు రూ.600; EWS అభ్యర్థులకు 550; OBC – NCL అభ్యర్థులకు రూ.400; వికలాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.275

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 5

కౌన్సెలింగ్‌కు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల: అక్టోబర్ 12న

ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: అక్టోబర్ 18న

అడ్మిషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: అక్టోబర్ 25

అడ్మిషన్ లెటర్స్ జారీ చేసిన తేదీ: అక్టోబర్ 27

తరగతుల ప్రారంభం: నవంబర్ 1 నుండి

వెబ్‌సైట్: http://acad.uohyd.ac.in/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *