బీజేపీ పార్టీ దేశం కోసం, పేద ప్రజల కోసం పనిచేస్తుంటే, టీఆర్‌ఎస్ నా యకులు కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని చొల్లేడు, కల్వకుంట్ల, కొంపెల్లి గ్రామాల్లో శనివారం బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
మునుగోడు రూరల్, అక్టోబర్ 22: బీజేపీ పార్టీ దేశం కోసం, పేద ప్రజల కోసం పనిచేస్తుంటే, టీఆర్‌ఎస్ నా యకులు కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని చొల్లేడు, కల్వకుంట్ల, కొంపెల్లి గ్రామాల్లో శనివారం బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను నమ్మించి బీజేపీ ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తుండగా, టీఆర్‌ఎస్ నాయకులు డబ్బును నమ్ముకుని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. డబ్బు, మద్యం, పార్టీ ఫిరాయింపులతో టీఆర్‌ఎస్ గెలవాలని చూస్తోందని విమర్శించారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని ప్రజలకు చైతన్యం ఉందన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పేదలు ఉంటే సీఎం కేసీఆర్ పదుల ఎకరాల్లో బుల్లెట్ ప్రూఫ్ భవనాన్ని నిర్మించారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిజాం పాలనకు ముప్పు పొంచి ఉందని, ఈ కొత్త నిజాం కుటుంబ పాలనను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ కుటుంబం ప్రపంచంలోనే నెంబర్ వన్ అని అన్నారు. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ కు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మునుగోడులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తిరుగుతున్నారని, దీంతో రాష్ట్రంలో పాలన స్తంభించిందన్నారు. కార్యక్రమంలో నాయకులు కంకణాల శ్రీధర్ రెడ్డి, మారబోయిన రవికుమార్ యాదవ్, కుంభం శ్రీనివాస్ రెడ్డి, జాల వెంకన్న, పగిళ్ల భిక్షం, యాదగిరిరెడ్డి, దోతి కుమార్, వీరమల్ల శంకర్ పాల్గొన్నారు.
నవీకరించబడిన తేదీ – 2022-10-23T01:08:16+05:30 IST