బ్రిటన్ చేరుకున్న బోరిస్ జాన్సన్… ప్రధాని రేసుకు సిద్ధమా?

బ్రిటన్ చేరుకున్న బోరిస్ జాన్సన్… ప్రధాని రేసుకు సిద్ధమా?

లండన్: బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, భారత సంతతికి చెందిన రిషి సునక్, కామన్స్ నాయకుడు పెన్నీ మోర్డాంట్ ఈ పదవికి పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బోరిస్ విదేశీ పర్యటన నుంచి కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్‌కు తిరిగొచ్చాడు.

దుష్ప్రవర్తన ఆరోపణలతో బోరిస్ జాన్సన్ మూడు నెలల క్రితం ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రధాని పదవిని చేపట్టిన లిజ్ ట్రస్ 45 రోజుల తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. దాంతో కథ మళ్లీ మొదలైంది.

ఈ నేపథ్యంలో భార్యాపిల్లలతో కలిసి డొమినికన్ రిపబ్లిక్ లో విహారయాత్రకు వెళ్లిన బోరిస్ జాన్సన్.. తిరిగి లండన్ చేరుకున్నాడు. అయితే ప్రధాని పదవికి ఎలా పోటీ చేస్తారని మాజీ ఉప ప్రధాని డొమినిక్ రాబ్ ప్రశ్నించారు. కోవిడ్ -19 ఆంక్షల సమయంలో డౌనింగ్ స్ట్రీట్‌లో పార్టీ చేసుకున్నందుకు తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతోందని ఆయన గుర్తు చేశారు. అయితే మాజీ హోం సెక్రటరీ ప్రీతి పటేల్ ఆయనకు మద్దతు పలికారు.

సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు కనీసం 100 మంది ఎంపీల మద్దతును పొందగలిగితే బోరిస్ జాన్సన్‌కు ప్రధాని పదవికి పోటీ చేసే అవకాశం ఉంటుంది.

లిజ్ ట్రస్ చేతిలో ఓడిపోయిన రుషి సునక్‌కు ఎంపీల మద్దతు ఉన్నప్పటికీ, కన్జర్వేటివ్ పార్టీలోని అట్టడుగు స్థాయి సభ్యుల మద్దతు కరువైనట్లు కనిపిస్తోంది. అయితే ఆయన అభ్యర్థిత్వానికి ఎంపీల మద్దతు లభించిందని బ్రిటన్ మీడియా చెబుతోంది. కన్జర్వేటివ్ ఎంపీ హెలెన్ గ్రాంట్ రుషికి మద్దతుగా ట్వీట్ చేశారు.

మరోవైపు, పెన్నీ మోర్డాంట్ తన అభ్యర్థిత్వాన్ని ట్విట్టర్‌లో ప్రకటించారు. ప్రధాని పదవికి ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఆమె 2019లో కొంతకాలం డిఫెన్స్ సెక్రటరీగా పనిచేశారు.

నవీకరించబడిన తేదీ – 2022-10-23T15:26:13+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *