యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ) – పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తు గడువును పొడిగించింది. అలాగే, ప్రవేశానికి సంబంధించిన రాత పరీక్ష, ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను కూడా మార్చారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అన్ని డివిజన్లలో కలిపి మొత్తం 281 సీట్లు ఉన్నాయి. వీటిలో 100 సీట్లను జనరల్ అభ్యర్థులకు కేటాయించారు.
స్పెషలైజేషన్లు – సీట్లు: అప్లైడ్ మ్యాథమెటిక్స్ 1, స్టాటిస్టిక్స్ 1, కంప్యూటర్ సైన్స్ 15, ఫిజిక్స్ 20, ఎలక్ట్రానిక్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 5, కెమిస్ట్రీ 16, బయోకెమిస్ట్రీ 13, ప్లాంట్ సైన్సెస్ 9, మైక్రోబయాలజీ 2, యానిమల్ బయాలజీ 12, బయోటెక్నాలజీ 13, కంప్యూటేషన్, సిస్టమ్స్ 13, సిస్టమ్స్ 28, ఉర్దూ 1, అనువర్తిత భాషాశాస్త్రం 22, అనువాద అధ్యయనాలు 1, తులనాత్మక సాహిత్యం 4, సంస్కృత అధ్యయనాలు 2, ఆంగ్ల భాషా అధ్యయనాలు 4, చరిత్ర 8, రాజకీయ శాస్త్రం 14, సామాజిక శాస్త్రం 12, ఆంత్రోపాలజీ 3, విద్య 5, ప్రాంతీయ సంస్కృతి 1 , సోషల్ 2, జెండర్ స్టడీస్ 3, ఎకనామిక్స్ 11, డ్యాన్స్ 2, ఆర్ట్ హిస్టరీ అండ్ విజువల్ స్టడీస్ 1, కమ్యూనికేషన్ 3, మేనేజ్‌మెంట్ స్టడీస్ 16, హెల్త్ సైన్సెస్ – పబ్లిక్ హెల్త్ 4, ఆప్టోమెట్రీ 2, నర్సింగ్ సైన్సెస్ 1, బయోమెడికల్ సైన్సెస్ 3, సైకాలజీ 1 కాగ్నిటివ్ సైన్స్ 4, మెటీరియల్స్ ఇంజనీరింగ్ 7, నానోసైన్స్ అండ్ టెక్నాలజీ 1.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కనీసం 55 శాతం మార్కులు తప్పనిసరి. ఫస్ట్ క్లాస్ మార్కులతో బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంఫిల్ (మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన సమాచారం
సాధారణ అభ్యర్థులకు రూ.600; EWS అభ్యర్థులకు 550; OBC అభ్యర్థులకు రూ.400; వికలాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.275.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 26
హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్: నవంబర్ 14 నుండి
పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలు: నవంబర్ 19, 20
ఇంటర్వ్యూ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల జాబితా విడుదల చేయబడింది: డిసెంబర్ 1న
ఇంటర్వ్యూలు: డిసెంబర్ 8 నుండి 12 వరకు
అడ్మిషన్ల జాబితా విడుదల: డిసెంబర్ 27న
ఫిజికల్ రిపోర్టింగ్: 2023 జనవరి 4, 5
వెబ్‌సైట్: acad.uohyd.ac.in