రెనాల్ట్ 10 లక్షల ఉత్పత్తి మైలురాయి

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-06-15T03:48:23+05:30 IST

రెనాల్ట్ ఇండియా భారతదేశంలో 10 లక్షల కార్ల తయారీ మైలురాయిని చేరుకుంది. ప్రస్తుతం, రెనాల్ట్ ఇండియా భారతదేశం నుండి 14 దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది మరియు కంపెనీకి భారతదేశాన్ని కార్ల తయారీ కేంద్రంగా మారుస్తుంది.

రెనాల్ట్ 10 లక్షల ఉత్పత్తి మైలురాయి

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): రెనాల్ట్ ఇండియా భారతదేశంలో 10 లక్షల కార్ల తయారీ మైలురాయిని చేరుకుంది. ప్రస్తుతం భారత్ నుంచి 14 దేశాలకు కార్లను ఎగుమతి చేస్తున్నామని, కంపెనీకి భారత్‌ను కార్ల తయారీ హబ్‌గా మార్చబోతున్నామని రెనాల్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. రెనాల్ట్ ఇండియాకు చెన్నైలో సంవత్సరానికి 4,80,000 కార్లను ఉత్పత్తి చేయగల ప్లాంట్ ఉంది. భవిష్యత్‌లో కార్లకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా దీనిని వినియోగించనున్నట్లు వెంకట్రామ్ తెలిపారు. ప్రస్తుతం భారత్ లో క్విడ్, కైజర్, ట్రైబర్ మోడళ్లను విక్రయిస్తున్నామని… భవిష్యత్తులో మరిన్ని మోడళ్లను విడుదల చేసి డీలర్ నెట్ వర్క్ ను పెంచుతామని వివరించారు. జాయింట్ వెంచర్ భాగస్వామి నిస్సాన్ మోటార్స్‌తో కలిసి ఆరు కొత్త కార్లను విడుదల చేయనున్నట్లు రెనాల్ట్ ఫిబ్రవరిలో ప్రకటించింది. ఇందులో రెండు ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి. ప్రతిపాదిత ఆరు కార్లలో మొదటి కార్లను 2025 నాటికి డెలివరీ చేస్తామని రెనాల్ట్ వెల్లడించింది.

టి-హబ్‌తో ఒప్పందం..

రెనాల్ట్ నిస్సాన్ టెక్నాలజీ బిజినెస్ సెంటర్ ఇండియా మరియు టి-హబ్ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందానికి అనుగుణంగా నిపుణులు, స్టార్టప్‌లను అనుసంధానం చేసేందుకు కార్పొరేట్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్‌ను చేపట్టనున్నట్లు రెనో టెక్నాలజీ బిజినెస్ సెంటర్ ఇండియా ఎండీ దేబాషిస్ నియోగి తెలిపారు. మొబిలిటీ మార్కెట్ లో వేగంగా మార్పులు వస్తున్నాయని, ఇన్నోవేషన్ తో కొత్త ట్రెండ్స్ సృష్టించడం వ్యాపార వ్యూహంగా మారిందని అన్నారు.

నవీకరించబడిన తేదీ – 2023-06-15T03:48:23+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *