టెస్టుల్లో ధీటుగా రాణిస్తూ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు సంచలన రీతిలో ఆరంభించింది.

తొలి ఇన్నింగ్స్ 393/8 డిక్లేర్ చేసింది
రూట్ అజేయ సెంచరీ
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 14/0
బర్మింగ్‌హామ్: టెస్టుల్లో ధీటుగా రాణిస్తూ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు సంచలన రీతిలో ఆరంభించింది. బేస్ బాల్ వ్యూహంతో శుక్రవారం తొలిరోజు తొలి ఇన్నింగ్స్ లో 78 ఓవర్లలో 8 వికెట్లకు 393 పరుగులు చేసిన ఇంగ్లండ్ కూడా అనూహ్యంగా డిక్లరేషన్ చేసింది. వెటరన్ జో రూట్ (118 నాటౌట్) వన్డే శైలిలో ఓవర్‌కు ఐదు పరుగుల చొప్పున సాగిన వారి జోరులో అజేయ సెంచరీతో నిలిచాడు. 2015 తర్వాత ఆసీస్ పై తొలి సెంచరీ.. అలాగే బెయిర్ స్టో (78 బంతుల్లో 78) తుఫాను వేగంతో చెలరేగగా.. ఓపెనర్ క్రాలే (61) ఉజ్వల ఆరంభాన్నిచ్చాడు. వికెట్ ఫ్లాట్ కావడంతో ఆసీస్ బౌలర్లకు చెమటలు పట్టాల్సి వచ్చింది. బెయిర్‌స్టో, రూట్ ఆరో వికెట్‌కు 140 బంతుల్లో 121 పరుగులు జోడించారు. అయితే 400 పరుగులకు అత్యంత సమీపంలో రూట్ క్రీజులో ఉండగానే తొలి రోజు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎక్కువ పరుగులు చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్పిన్నర్ లియాన్‌కు నాలుగు వికెట్లు, హాజిల్‌వుడ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే ఆడిన ఆసీస్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. క్రీజులో వార్నర్ (8 బ్యాటింగ్), ఖవాజా (4 బ్యాటింగ్) ఉన్నారు.
సంక్షిప్త స్కోర్లు: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 393/8 డిక్లేర్డ్ (రూట్ 118 నాటౌట్, బెయిర్‌స్టో 78, క్రాలే 61; లియాన్ 4/149, హాజిల్‌వుడ్ 2/61).
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 14/0 (వార్నర్ 8 బ్యాటింగ్, ఖవాజా 4 బ్యాటింగ్)
నవీకరించబడిన తేదీ – 2023-06-17T02:05:26+05:30 IST