ఈ వారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా అదే బాటలో పయనించే అవకాశం ఉంది. బక్రీద్ కారణంగా బుధవారం స్టాక్ మార్కెట్లు ఆఫ్‌లో ఉన్నాయి. అలాగే జూన్ నెల ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టులు గురువారంతో ముగియనున్న నేపథ్యంలో అంతర్జాతీయ ట్రెండ్స్ ఈ వారం మార్కెట్లపై ప్రభావం చూపవచ్చు. గత వారం కొత్త గరిష్టాలను తాకాలని నిఫ్టీ చేసిన ప్రయత్నాలు కార్యరూపం దాల్చలేదు. సాంకేతికంగా, నిఫ్టీ 18,880 స్థాయిల వద్ద బలమైన ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. స్వల్పకాలిక బుల్లిష్ ట్రెండ్ ఈ కీలక స్థాయిల కంటే ఎక్కువగా కొనసాగితేనే చూడవచ్చు. ప్రస్తుత ధరల ప్రకారం, నిఫ్టీ 20 EMA కంటే కొంచెం ఎగువన ముగిసింది. గంట చార్టుల ప్రకారం నిఫ్టీ ‘బేరిష్ డబుల్ టాప్’ ప్యాటర్న్‌లో ఉంది. ఈ వారం 18,600-18,650 స్థాయిల కంటే ఎక్కువ ట్రేడ్ అయితే బుల్లిష్ ట్రెండ్ కనిపించే అవకాశం ఉంది. కాకపోతే, కరెక్షన్‌లోకి జారిపోయి 18,500-18,450 స్థాయిలకు చేరుకోవచ్చు. ఏదైనా అప్‌ట్రెండ్‌ని సూచిస్తే, తక్షణ నిరోధ స్థాయిలు 18,750 వద్ద ఉన్నాయి. ఈ స్థాయిలు దాటితే ఆల్ టైమ్ హై లెవెల్ 18,888కి చేరుకునే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా మార్కెట్ అప్ ట్రెండ్ ను సద్వినియోగం చేసుకోలేకపోయిన ట్రేడర్లు… ప్రస్తుత కరెక్షన్ సమయంలో కొనుగోళ్లపై దృష్టి పెట్టవచ్చు.
స్టాక్ సిఫార్సులు
డాక్టర్ రెడ్డీస్: ఈ కౌంటర్ గత కొన్ని సెషన్లలో బలమైన కొనుగోలు మద్దతును పొందింది. ముగింపు ఆధారంగా, బ్రేక్‌అవుట్‌తో ‘V’ ఆకారం రికవరీ కనిపిస్తుంది. రోజువారీ టైమ్ ఫ్రేమ్ చార్ట్ బుల్లిష్ ట్రెండ్‌ని సూచిస్తుంది. సమీప భవిష్యత్తులో ఈ షేర్ ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. గత శుక్రవారం రూ.4,993.90 వద్ద ముగిసిన ఈ స్టాక్‌ను రూ.5,300 టార్గెట్ ధరతో కొనుగోలు చేయడానికి పరిగణించవచ్చు. కానీ రూ.4,820 స్థాయిని స్టాప్‌లాస్‌గా ఉంచాలి.
డాబర్: ఈ స్టాక్ గత వారం బలమైన బ్రేక్‌అవుట్ చేసి 200 SMAను దాటింది. రోజువారీ చార్టుల ప్రకారం, ఇది 21 DMAతో మరోసారి బుల్లిష్ ట్రెండ్‌ను ఏర్పరుచుకుంది. సాంకేతికంగా చెప్పాలంటే, సమీప కాలంలో ఈ షేరు అప్‌ట్రెండ్‌లో కదిలే అవకాశం ఉంది. గత శుక్రవారం రూ.563.35 వద్ద ముగిసిన ఈ స్టాక్‌ను రూ.595 టార్గెట్ ధరతో కొనుగోలు చేయడానికి పరిగణించవచ్చు. కానీ రూ.540 స్థాయిని స్టాప్‌లాస్‌గా ఉంచాలి.
ఓషో కృష్ణన్, సీనియర్ విశ్లేషకుడు,
టెక్నికల్, డెరివేటివ్స్, ఏంజెల్ వన్ లిమిటెడ్
గమనిక: పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు పెట్టుబడిదారులు తమ ఆర్థిక సలహాదారులను సంప్రదించాలి.