నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. మహేష్ బాబు.పి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఆగస్ట్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా స్టిల్
నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి). మహేష్ బాబు దర్శకత్వంలో యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా వచ్చి చాలా కాలమైనప్పటికీ, మేకర్స్ ఇటీవల వరుస అప్‌డేట్‌లు ఇవ్వడం ప్రారంభించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ కూడా ఆసక్తికరంగా మారింది. (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి విడుదల తేదీ)
‘భాగమతి’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత అనుష్క మరోసారి యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’లో నటిస్తోంది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒక పాటను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పాడారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తికావడంతో.. విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. అలాగే ప్రమోషన్స్ పై కూడా టీమ్ దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో అన్విత రవళి శెట్టి పాత్రలో అనుష్క.. స్టాండ్ అప్ కమెడియన్ సిద్ధు పోలిశెట్టి పాత్రలో నవీన్ పోలిశెట్టి నటించారు. లేటెస్ట్ రిలీజ్ డేట్ పోస్టర్ (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్ పోస్టర్)ని పరిశీలిస్తే… ఇందులో కూడా హీరో, హీరోయిన్లు ఉన్నారు. ఆహ్లాదకరమైన అనుభూతిని ఇచ్చే పోస్టర్ ఉంది. ఈ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు.
****************************************
****************************************
****************************************
****************************************
నవీకరించబడిన తేదీ – 2023-07-03T16:30:53+05:30 IST