దర్శక నిర్మాత సాయి రాజేష్‌కి నిర్మాత ఎస్‌కెఎన్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ‘బ్రో’ సినిమాలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ధరించిన బూట్లను తమ నిర్మాత బహుమతిగా ఇచ్చారని సాయి రాజేష్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. SKN షూస్ ఇస్తున్న ఫోటోని షేర్ చేసారు. ప్రస్తుతం ఈ ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి.

దర్శక నిర్మాత సాయి రాజేష్‌కి నిర్మాత ఎస్‌కెఎన్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ‘బ్రో’ సినిమాలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ధరించిన బూట్లను తమ నిర్మాత బహుమతిగా ఇచ్చారని సాయి రాజేష్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. SKN ఆమెకు షూస్ ఇస్తున్న ఫోటోని షేర్ చేసారు. ప్రస్తుతం ఈ ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఆ గిఫ్ట్ ఇవ్వడానికి కారణం ‘బేబీ’ సినిమా. రీసెంట్ గా ఫస్ట్ కాపీని చిత్ర యూనిట్ చూసింది. నిర్మాత ఎస్‌కెఎన్‌కి ఈ సినిమా బాగా నచ్చింది. ఆ ఆనందంతో దర్శకుడికి ఓ గిఫ్ట్ ఇచ్చారు.
‘బ్రో’ సినిమా పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ ధరించిన షూస్ అందరినీ ఆకర్షించాయి. సాధారణ షూలకు భిన్నంగా ఉండే షూల గురించి చాలా మంది నెట్‌లో సెర్చ్ చేశారు. అయితే షూల ధర చూసి షాక్ తిన్నారు. పారిస్‌కు చెందిన లగ్జరీ బ్రాండ్ ‘బాల్‌మెయిన్’ తయారు చేసిన ఈ షూస్ ధర రూ.1,06,870. అలాంటి ఖరీదైన బూట్లను బేబీ చిత్ర దర్శకుడు సాయి రాజేష్‌కి నిర్మాత ఎస్‌కెఎన్ బహుమతిగా ఇచ్చారు.
“మా నిర్మాత అన్నయ్య ‘బేబీ’ సినిమా ఫస్ట్ కాపీ చూసి ఈ షూస్ గిఫ్ట్ గా ఇచ్చాడు. లవ్ యూ ఎస్కేఎన్. మళ్లీ ఇంత ధర పెట్టి షూస్ కొనాలనే ఆలోచన కూడా చాలా భయంగా ఉంది” అంటూ సాయి రాజేష్ ట్వీట్ చేశాడు. ఆనంద్ దేవరకొండ నటించిన ‘బేబీ’ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్‌కెఎన్ మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై దీనిని నిర్మిస్తున్నారు. ఈ నెల 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
నవీకరించబడిన తేదీ – 2023-07-04T16:36:41+05:30 IST