మెగా ఫ్యామిలీలో నిహారిక, చైతన్య దంపతులు గత కొంత కాలంగా సఖ్యతగా లేరంటూ కొన్ని పేపర్లు మీడియా వర్గాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ విడాకుల పై క్లారిటీ ఇస్తూ నిహారిక కూడా పోస్ట్ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ తన మూడో భార్యకు విడాకులు ఇస్తున్నారని, ఆమె ఇప్పుడు హైదరాబాద్‌లో లేదని కొందరు పుకార్లు సృష్టించారు. ఓ రాజకీయ పార్టీ ‘ప్యాకేజీ’ ఇచ్చి జాతీయ మీడియాలో ప్రచారం చేసిందంటూ వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో.. అలాంటి వారందరికీ జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ఝలక్ ఇచ్చింది.
వారాహి విజయ యాత్ర మొదటి విడత విజయవంతంగా ముగిసిన సందర్భంగా హైదరాబాద్‌లోని వారి నివాసంలో జరిగిన పూజాదికాల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా కొణిదెల (అన్నా లెజ్నెవా) పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్, అన కొణిదెల ఈ దాన ధర్మాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మరికొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ త్వరలో మంగళగిరికి చేరుకోనున్నారు..” అంటూ పవన్ కళ్యాణ్, అన కలిసి పూజలు చేస్తున్న ఫోటోను జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
దీంతో కొందరు చేస్తున్న రూమర్లకు బ్రేక్ పడినట్లే. అలాగే.. జాతీయ మీడియా చేస్తున్న పబ్లిసిటీ చూసి.. కొందరు తాము రాస్తున్నది నిజమో కాదో క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదేమిటని పవన్ కళ్యాణ్ భాషలో చెబితే.. సమాధానం చెంపపెట్టులాంటిదని.. మెగా అభిమానులు, జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
****************************************
*******************************************
****************************************
*******************************************
****************************************
నవీకరించబడిన తేదీ – 2023-07-05T19:34:19+05:30 IST