ఆది అక్షర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బాబు పెదపూడి నిర్మిస్తున్న చిత్రం ‘రివెంజ్’. నేహదేశ్ పాండే కథానాయిక. రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన లభించగా.. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూలై 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
ఈ సందర్భంగా హీరో, నిర్మాత బాబు పెదపూడి మాట్లాడుతూ.. కుటుంబ సభ్యుల సహకారంతో విదేశాలకు వెళ్లాను. కానీ నాకు మొదటి నుంచి సినిమాలంటే ఇష్టం. విదేశాల్లో ఉంటూనే త్రివిక్రమ్ ‘అతడు’, దశరథ్ ‘శ్రీ’లో మంచి క్యారెక్టర్లు చేశాను. కొన్ని అవకాశాలు వచ్చినా నా బిజీ షెడ్యూల్ వల్ల చేయలేకపోయాను. ఈ క్రమంలోనే మూడేళ్ల కిత్రం దర్శకుడు శ్రీనివాస్‌గారితో పరిచయం ఏర్పడింది. నన్ను మంచి నటుడిగా పరిచయం చేసేందుకు ఎన్నో పాత్రలు రాశారు. అతని డెడికేషన్ నచ్చి ఈ సినిమా ఇచ్చాను. ట్రైలర్ చూశాక ఇదో సైకో స్టోరీలా అనిపిస్తుంది. అయితే బర్నింగ్ పాయింట్స్ తో తీసిన సినిమా ఇది. మనం ప్రాణంగా ప్రేమించే వ్యక్తులకు ఏదైనా జరిగినప్పుడు మనం ఎలా మారతాము అనేది ఈ సినిమా కాన్సెప్ట్. చిత్రాన్ని హృదయానికి హత్తుకునేలా దర్శకుడు తెరకెక్కించారు.. జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు తెలిపారు.(రివెంజ్ రిలీజ్ డేట్ అవుట్)
చిత్ర దర్శకుడు రెట్టడి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తాను సినీ రంగంలో 30 ఏళ్లుగా ఉన్నా. విజయ్ భాస్కర్, వంశీ వంటి ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేశాను. పొదారిల్లు, ఐపీసీ సెక్షన్ అనే రెండు చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఇది మూడో సినిమా. హీరో, నిర్మాత బాబు అభిరుచి చూసి మంచి కథ రాయాలని నిర్ణయించుకున్నాను. చాలా పాత్రలు రాశాను. చివరగా రివెంజ్ స్టోరీ తీసుకున్నాం. మొదట క్యారెక్టర్ రాసి, ఆ తర్వాత సినిమా కథ రాశాను. సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని తెలిపారు. ఆరోహి, భార్గవ్, నగేష్ కర్రా ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ కూరాకుల సంగీతం అందించారు.
*******************************************
*******************************************
****************************************
****************************************
*******************************************
*******************************************
నవీకరించబడిన తేదీ – 2023-07-05T20:04:23+05:30 IST