జింబాబ్వే కల చెదిరిపోయింది. వన్డే ప్రపంచకప్ బెర్త్ ఖాయం చేసుకోవడంలో మరోసారి విఫలమైంది. భారత్‌లో ప్రపంచకప్ బెర్త్‌ను ఖాయం చేసుకోవడానికి జింబాబ్వేకు ప్రపంచకప్ క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్‌లో ఒక్క విజయం చాలు. అయితే కీలక మ్యాచ్‌లో జింబాబ్వే తడబడింది.
ప్రపంచకప్ బెర్త్ మిస్ అయింది
స్కాట్లాండ్‌కు సంచలన విజయం
బులవాయో: జింబాబ్వే కల చెదిరిపోయింది. వన్డే ప్రపంచకప్ బెర్త్ ఖాయం చేసుకోవడంలో మరోసారి విఫలమైంది. భారత్‌లో ప్రపంచకప్ బెర్త్‌ను ఖాయం చేసుకోవడానికి జింబాబ్వేకు ప్రపంచకప్ క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్‌లో ఒక్క విజయం చాలు. అయితే కీలక మ్యాచ్‌లో జింబాబ్వే తడబడింది. ర్యాన్ బర్ల్ (83) ఒంటరి పోరాటం చేసినా అతనికి ఇతరుల నుంచి మద్దతు లభించలేదు. ఫలితంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 31 పరుగుల తేడాతో జింబాబ్వేపై సంచలన విజయం సాధించింది. ఈ ఓటమితో క్రెయిగ్ ఇర్విన్ జట్టు ప్రపంచకప్ ఆశలు గల్లంతైనప్పటికీ స్కాట్లాండ్ అవకాశాలు మెరుగయ్యాయి. తక్కువ నెట్ రన్ రేట్ (-0.099) జింబాబ్వేకు శాపంగా మారింది. 2018లో కూడా జింబాబ్వే కీలక మ్యాచ్‌లో ఓడి క్వాలిఫయర్స్‌లో పుంజుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 234 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే 41.1 ఓవర్లలో 203 పరుగులకే కుప్పకూలింది. క్రిస్ సోల్ 3 వికెట్లతో ప్రత్యర్థి వెన్ను విరిచాడు. ఇదిలా ఉంటే గురువారం నెదర్లాండ్స్ తో జరిగే మ్యాచ్ లో స్కాట్లాండ్ గెలిస్తే ప్రపంచకప్ బెర్త్ నేరుగా ఖాయం అవుతుంది. భారీ తేడాతో ఓడిపోతే నెదర్లాండ్స్‌కు అవకాశం దక్కుతుంది.
ఐర్లాండ్ విజయం..:
ఏడో స్థానం ప్లేఆఫ్ మ్యాచ్‌లో ఐర్లాండ్ 2 వికెట్ల తేడాతో నేపాల్‌ను ఓడించింది. తొలుత నేపాల్ స్కోరు 268/9. ఐర్లాండ్ 49.2 ఓవర్లలో 8 వికెట్లకు 269 పరుగులు చేసి విజయం సాధించింది.
నవీకరించబడిన తేదీ – 2023-07-05T00:58:03+05:30 IST