హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ తన మంచి మనసును చాటుకున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్న సిరాజ్.. స్థానిక ఆటగాళ్లకు తన బ్యాట్, షూలను బహుమతిగా ఇచ్చాడు. దీంతో సిరాజ్ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం భారత జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా కరీబియన్ జట్టుతో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. టెస్టు సిరీస్‌లో భాగంగా ఈ నెల 12 నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో 2 వారాల ముందే వెస్టిండీస్ చేరుకున్న భారత జట్టు బార్బడోస్ లో ప్రాక్టీస్ చేసింది.
కాగా, బార్బడోస్‌లోని స్థానిక ఆటగాళ్లు భారత జట్టు ప్రాక్టీస్‌కు సహకరించారు. భారత ఆటగాళ్లను చూసేందుకు స్థానిక అభిమానులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే శనివారం బార్బడోస్‌లో ప్రాక్టీస్ ముగించుకుని డొమినికాలో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌కు భారత జట్టు బయలుదేరింది. అయితే అక్కడి నుంచి మార్గమధ్యలో భారత ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌లో సహకరించిన స్థానిక ఆటగాళ్లకు ఆటలోని మెళకువలను చెప్పారు. అంతేకాకుండా స్థానిక ఆటగాళ్లతో పాటు అక్కడికి వచ్చిన అభిమానులకు భారత ఆటగాళ్లు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. సెల్ఫీలు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో మన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ స్థానిక ఆటగాళ్లకు తన బ్యాట్, షూలను బహుమతిగా ఇచ్చి తన మంచి మనసును చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సిరాజ్ మనసు బంగారం అంటూ అభిమానులు కొనియాడుతున్నారు. ఆ తర్వాత భారత ఆటగాళ్లంతా స్థానిక ఆటగాళ్లతో సరదాగా సంభాషించారు. అనంతరం మ్యాచ్ వేదిక డొమినికాకు వెళ్లింది.
భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ థాక్‌ర్ , అక్షర్ పటేల్, Mohd. సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.
నవీకరించబడిన తేదీ – 2023-07-09T12:59:47+05:30 IST