చివరిగా నవీకరించబడింది:
తెలంగాణలో నీట్ కౌన్సెలింగ్ ప్రారంభం కావడంతో చాలా మంది విద్యార్థులు తమకు సీటు వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. అయితే గతంలో కంటే మెడికల్ సీట్లు పెరిగినందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సతీష్ అంటున్నారు. గతేడాది మొదటి, ద్వితీయ, మాప్‌అప్ రౌండ్‌ల తర్వాత కూడా చాలా ప్రైవేట్ కాలేజీల్లో బీ కేటగిరీ సీట్లు మిగిలిపోయాయని తెలిపారు.
తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లు: తెలంగాణలో నీట్ కౌన్సెలింగ్ ప్రారంభం కావడంతో చాలా మంది విద్యార్థులు తమకు సీటు వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. అయితే గతంలో కంటే మెడికల్ సీట్లు పెరిగినందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సతీష్ అంటున్నారు. గతేడాది మొదటి, ద్వితీయ, మాప్‌అప్ రౌండ్‌ల తర్వాత కూడా చాలా ప్రైవేట్ కాలేజీల్లో బీ కేటగిరీ సీట్లు మిగిలిపోయాయని తెలిపారు. అందువల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తొందరపడి సి కేటగిరీకి పాల్పడవద్దని తెలిపారు.
కౌన్సెలింగ్ ద్వారా ప్రతి సీటు భర్తీ.. (తెలంగాణలో MBBS సీట్లు)
ముఖ్యంగా బీ కేటగిరీ సీట్లలో తెలంగాణ విద్యార్థులకు 85 శాతం, తెలంగాణేతర విద్యార్థులకు 15 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. గతేడాది కౌన్సెలింగ్‌ను పరిశీలించినప్పుడు అన్ని రౌండ్లు పూర్తయినా అపోలో, కామినేని, ప్రతిమ, ఎంఎన్‌ఆర్, మమత, ఎస్‌వీవీఎస్, మహేశ్వర మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ సీట్లు మిగిలాయని సతీష్ చెబుతున్నారు. తెలంగాణలో మొత్తం 23 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ ఏడాది మరికొన్ని కాలేజీలు చేరడం వల్ల సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఆందోళన చెందకుండా స్టే వేకెన్సీ రౌండ్‌కు వెళ్లాలి. ప్రతి సీటును కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలని జాతీయ వైద్య మండలి పేర్కొంది. అందువల్ల విద్యార్థులు దళారుల మాటలు విని లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని సతీష్ తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించి విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే పూర్తి వివరాల కోసం డాక్టర్ సతీష్ 8886629883 సంప్రదించవచ్చు.