మణిపూర్ అల్లర్లపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో కేంద్రం అందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.
అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం
నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
ధరల పెంపుపై వ్యతిరేకత
కేంద్రం 31 బిల్లులను ప్రతిపాదించింది
న్యూఢిల్లీ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): మణిపూర్ అల్లర్లపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో కేంద్రం అందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 11వ తేదీ వరకు నిర్వహిస్తామని.. ‘ఇండియా’ పేరుతో కూటమిగా ఏర్పడిన ప్రతిపక్షాలు ఉమ్మడిగా పార్లమెంట్‌లో సమస్యలను లేవనెత్తాయి. ముఖ్యంగా మణిపూర్ అల్లర్లు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, నిరుద్యోగం, గవర్నర్ వ్యవస్థ వంటి అంశాలను లేవనెత్తాలని ఇప్పటికే నిర్ణయించారు. అయితే కేంద్రం తీసుకొస్తున్న ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ బిల్లును పలు పార్టీలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ రణరంగంగా మారే అవకాశం ఉంది. కాగా, కేంద్రం 31 బిల్లులను ప్రతిపాదించింది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని, అన్ని అంశాలను చర్చించి లేవనెత్తేందుకు అవకాశం ఇవ్వాలని మంత్రులు కోరారు. మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటన చేయాలని కాంగ్రెస్ సహా పలు పార్టీలు డిమాండ్ చేశాయి. ఉమ్మడి పౌరస్మృతి బిల్లును తీసుకురానున్నారనే వార్తల నేపథ్యంలో ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని విపక్షాలు కేంద్రాన్ని కోరాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు ఒడిశాకు ప్రత్యేక హోదా బిల్లును ప్రవేశపెట్టాలని బీజేడీ ప్రతిపాదించింది.
నవీకరించబడిన తేదీ – 2023-07-20T03:00:21+05:30 IST