పేసర్ విద్వాత్ కావేరప్ప (5/17) చెలరేగడంతో.. దేవధర్ ట్రోఫీలో సోమవారం వర్షం ప్రభావిత మ్యాచ్‌లో సౌత్ జోన్ నార్త్ జోన్‌పై 185 పరుగుల (డి/ఎల్ పద్ధతి) తేడాతో విజయం సాధించింది.
నార్త్‌పై సౌత్ గెలుస్తుంది
దేవధర్ ట్రోఫీ
పుదుచ్చేరి: పేసర్ విద్వాత్ కావేరప్ప (5/17) చెలరేగడంతో.. దేవధర్ ట్రోఫీలో సోమవారం వర్షం ప్రభావిత మ్యాచ్‌లో సౌత్ జోన్ నార్త్ జోన్‌పై 185 పరుగుల (డి/ఎల్ పద్ధతి) తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ జగదీశన్ (72) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 303 పరుగులు చేసింది. ఓపెనర్ రోహన్ కున్నుమల్ (70), మయాంక్ అగర్వాల్ (64) అర్ధ సెంచరీలతో రాణించారు. రిషి ధావన్, మయాంక్ మార్కండే చెరో 2 వికెట్లు తీశారు. పలుమార్లు వర్షం అడ్డుకోవడంతో నార్త్ లక్ష్యాన్ని డక్‌వర్త్/లూయిస్ పద్ధతిలో 28 ఓవర్లలో 246 పరుగులకు సవరించారు. అయితే కావేరప్ప దెబ్బకు నార్త్ జోన్ 23 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. వైశాక్ విజయ్‌కుమార్ 2 వికెట్లు తీశాడు.
రాణినా పంచాల్..:
ప్రియాంక్ పంచాల్ (99 నాటౌట్), హార్విక్ దేశాయ్ (85) ధనాధన్ ఆటతో… వెస్ట్ జోన్ 9 వికెట్ల తేడాతో నార్త్ ఈస్ట్ జోన్‌పై విజయం సాధించింది. తొలుత నార్త్ ఈస్ట్ 47 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. ఇమ్లివాటి లెమటూర్ (38) టాప్ స్కోరర్. అర్జన్ నాగవాసవల్ల మూడు వికెట్లు తీశాడు. వెస్ట్ 25.1 ఓవర్లలో 208/1 స్కోరు చేసి విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో సెంట్రల్ జోన్‌పై ఈస్ట్ జోన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సెంట్రల్ 50 ఓవర్లలో 207 పరుగులకే కుప్పకూలింది. రిమ్ కూ సింగ్ (54) హాఫ్ సెంచరీ చేశాడు. స్వల్ప లక్ష్యాన్ని ఈస్ట్ 46.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సాధించింది.
నవీకరించబడిన తేదీ – 2023-07-25T02:08:59+05:30 IST