ABN
, First Publish Date – 2023-07-25T02:13:30+05:30 IST
శ్రీలంకతో సోమవారం ఆరంభమైన రెండో టెస్ట్‌లో తొలి రోజు పాకిస్థాన్ జట్టు పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది.

166 ఆలౌట్
పాకిస్థాన్ 145/2
కొలంబో: శ్రీలంకతో సోమవారం ఆరంభమైన రెండో టెస్ట్‌లో తొలి రోజు పాకిస్థాన్ జట్టు పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (4/69), పేసర్ నసీమ్ షా (3/41) విజృంభించడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ కేవలం 48.4 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలింది. మిగిలిన బ్యాటర్లంతా చెత్త షాట్లతో వికెట్లు పారేసుకోగా..ధనంజయ డిసిల్వా (57), దినేశ్ చాందిమల్ (34) ఐదో వికెట్‌కు 85 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోరైనా సాధ్యమైంది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన పాకిస్థాన్ ఆట ఆఖరికి 28.3 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. అబ్దులా షఫిక్ (74 బ్యాటింగ్), షాన్ మసూద్ (51) ధాటిగా ఆడారు. సోమవారం ఆట ఆఖరికి అబ్దుల్లాతోపాటు కెప్టెన్ బాబర్ (8 నాటౌట్) క్రీజులో ఉన్నారు. అసిత ఫెర్నాండో (2/41) రెండు వికెట్లు తీశాడు.
Updated Date – 2023-07-25T02:13:30+05:30 IST