‘జ్ఞాన్వాపి’ సర్వే: ‘జ్ఞాన్వాపి’ సర్వే నిలుపుదల

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-07-25T02:28:13+05:30 IST

వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు వివాదంపై సోమవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారా లేదా అని తెలుసుకోవడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారులు ఉదయం 7 గంటలకు సర్వే ప్రారంభించారు, అయితే సుప్రీం కోర్టు దానిపై స్టే విధించింది.

'జ్ఞాన్వాపి' సర్వే: 'జ్ఞాన్వాపి' సర్వే నిలుపుదల

ప్రారంభమైన కొన్ని గంటల్లోనే సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ, జూలై 24: వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు వివాదంపై సోమవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారా లేదా అని తెలుసుకోవడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారులు ఉదయం 7 గంటలకు సర్వే ప్రారంభించారు, అయితే సుప్రీం కోర్టు దానిపై స్టే విధించింది. కాశీ విశ్వనాథ మందిరం సమీపంలో ఉన్న ఈ మసీదు పరిస్థితిపై ‘సవివరమైన శాస్త్రీయ సర్వే’ నిర్వహించాలని వారణాసి జిల్లా కోర్టు ఈ నెల 21న ఆదేశించింది. దీనిని సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీన్ని సుప్రీంకోర్టు పరిశీలించింది.

హైకోర్టులో ఎందుకు అప్పీలు చేయలేదని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించగా.. సర్వే ప్రారంభమైనందున ఇక్కడికి వచ్చానని బదులిచ్చారు. దీంతో బుధవారం సాయంత్రం వరకు అక్కడ ఎలాంటి విధ్వంసకర పనులు, తవ్వకాలు జరపరాదని ధర్మాసనం స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టులో అప్పీలు చేసుకోవాలని మసీదు కమిటీని ఆదేశించింది. ఇందుకోసం రెండు రోజుల పాటు సర్వేను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ అప్పీల్‌ను బుధవారం సాయంత్రం విచారించాలని అలహాబాద్ హైకోర్టును ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సర్వేను నిలిపివేసినట్లు వారణాసి డివిజనల్‌ కమిషనర్‌ కౌశల్‌రాజ్‌ శర్మ తెలిపారు.

నవీకరించబడిన తేదీ – 2023-07-25T02:28:13+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *