టీ20ల్లో అనామక బౌలర్‌ ప్రపంచ రికార్డుABN
, First Publish Date – 2023-07-27T02:47:37+05:30 IST

మలేసియా పేసర్‌ సెజ్రుల్‌ ఇజాత్‌ ఇద్రస్‌ అరుదైన ఘనతను అందుకొన్నాడు. టీ20ల్లో ఏడు వికెట్లు తీసిన తొలి పురుష క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

టీ20ల్లో అనామక బౌలర్‌  ప్రపంచ రికార్డు

కౌలాలంపూర్‌: మలేసియా పేసర్‌ సెజ్రుల్‌ ఇజాత్‌ ఇద్రస్‌ అరుదైన ఘనతను అందుకొన్నాడు. టీ20ల్లో ఏడు వికెట్లు తీసిన తొలి పురుష క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌-2024 ఆసియా రీజినల్‌ క్వాలిఫయర్‌ ‘బి’ టోర్నీలో చైనాతో జరిగిన మ్యాచ్‌లో ఇద్రస్‌ ఈ ఫీట్‌ చేశాడు. కేవలం 8 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టడంతో.. చైనా 11.2 ఓవర్లలో 23 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని మలేసియా 5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Updated Date – 2023-07-27T02:47:37+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *