ABN
, First Publish Date – 2023-07-24T02:51:16+05:30 IST
ఈ ఏడాది ఆఖర్లో జరిగే ఐపీఎల్ మినీ వేలంలో ఒక్కో ఫ్రాంచైజీ రూ.100 కోట్ల వరకు ఖర్చు పెట్టే అవకాశం ఉంది.
ఐపీఎల్ మినీ వేలం
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆఖర్లో జరిగే ఐపీఎల్ మినీ వేలంలో ఒక్కో ఫ్రాంచైజీ రూ.100 కోట్ల వరకు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. గతేడాది ఈ మొత్తం రూ.95 కోట్లుగా ఉంది. ఈసారి కూడా వేలాన్ని డిసెంబరులోనే జరుపనుండగా.. వన్డే ప్రపంచకప్ తర్వాత వేదిక, తుది తేదీలను ఖరారు చేస్తారు. ముంబై, జైపూర్, అహ్మదాబాద్, కొచ్చి, కోల్‌కతాలలో ఒక నగరాన్ని ఎంపిక చేయనున్నారు. అయితే గతేడాదిలాగా ఈసారి క్రిస్మస్ సీజన్‌లో మాత్రం నిర్వహించబోమని బోర్డు అధికారులు తెలిపారు.
Updated Date – 2023-07-24T02:51:16+05:30 IST