రెండో రోజు 10 ఓవర్లే | Second day 10 overlay



ABN
, First Publish Date – 2023-07-26T02:28:12+05:30 IST

రసవత్తరంగా సాగుతున్న క్రికెట్‌ మ్యాచ్‌లకు వరుణుడి రాక అభిమానులను ఇబ్బంది పెడుతోంది. మొన్న యాషెస్‌, నిన్న భారత్‌-వెస్టిండీ్‌స మ్యాచ్‌ల్లో ఫలితాల్ని శాసించిన వర్షం..

రెండో రోజు 10 ఓవర్లే

లంక-పాక్‌ టెస్టుకు వరుణుడు అడ్డు

కొలంబో: రసవత్తరంగా సాగుతున్న క్రికెట్‌ మ్యాచ్‌లకు వరుణుడి రాక అభిమానులను ఇబ్బంది పెడుతోంది. మొన్న యాషెస్‌, నిన్న భారత్‌-వెస్టిండీ్‌స మ్యాచ్‌ల్లో ఫలితాల్ని శాసించిన వర్షం.. తాజాగా శ్రీలంక-పాకిస్థాన్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు కూడా అడ్డుపడ్డాడు. వాన కారణంగా రెండో రోజైన మంగళవారం కేవలం 10 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో రెండోరోజు ఆట రద్దయినట్టు అంపైర్లు ప్రకటించారు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 166 పరుగులకు ఆలౌటవగా.. వర్షంతో రెండో రోజు ఆట రద్దయ్యే సమయానికి పాక్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 178/2 స్కోరు చేసింది. అబ్దుల్లా షఫీక్‌ (87), బాబర్‌ ఆజమ్‌ (28) క్రీజులో ఉన్నారు.

Updated Date – 2023-07-26T02:28:12+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *