న్యూఢిల్లీ: ఐఎ్‌సఎ్‌సఎఫ్ వరల్డ్ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ పతక జోరు కొనసాగుతోంది. కొరియాలోని చాంగ్వాన్‌లో ఆదివారం జరిగిన పోటీల్లో పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో భార త బృందం రజతం సాధించింది. భక్తర్యుద్దీన్, శార్దూల్ విహాన్, ఆర్యవంశ్ త్యాగిలతో కూడిన భారత త్రయం ఫైనల్స్‌లో 346 స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. ఇటలీ జట్టు 356 పాయింట్లతో స్వర్ణం అందుకుంది.