ABN
, First Publish Date – 2023-07-26T01:19:56+05:30 IST
ఇటీవలే కొరియా ఓపెన్ విజేతగా నిలిచిన భారత డబుల్స్ టాప్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించారు.
న్యూఢిల్లీ: ఇటీవలే కొరియా ఓపెన్(Korea Open) విజేతగా నిలిచిన భారత డబుల్స్ టాప్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ (Satwik Sairaj-Chirag)షెట్టి కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించారు. మంగళవారం విడుదల చేసిన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్(BWF Rankings)లో సాత్విక్ జంట ఒక మెట్టెక్కి రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఆసియా చాంపియన్‌షి్‌ప్స, ఇండోనేసియా ఓపెన్, స్విస్ ఓపెన్ టైటిళ్లను కూడా సాత్విక్ ద్వయం సాధించింది. కాగా, మహిళల సింగిల్స్‌లో సింధు 17వ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. సైనా నెహ్వాల్ 37వ ర్యాంక్‌కు దిగజారింది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ 10వ ర్యాంక్‌లో నిలవగా.. ఫామ్ కోసం తంటాలు పడుతున్న కిడాంబి శ్రీకాంత్ 20వ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, మరో యువ షట్లర్ లక్ష్య సేన్ 13వ ర్యాంక్‌కు పడిపోయాడు.
Updated Date – 2023-07-26T01:19:56+05:30 IST