Satwik Sairaj : విజయాల హోరు టైటిళ్ల జోరు!



ABN
, First Publish Date – 2023-07-24T02:42:46+05:30 IST

భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఎక్కువగా సింగిల్స్‌ ఆటగాళ్లదే హవా కనిపిస్తుంది. అయితే డబుల్స్‌లో ఈ లోటును భర్తీ చేస్తూ తెలుగు షట్లర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి/ముంబై కుర్రాడు చిరాగ్‌ షెట్టి అంతర్జాతీయ యవనికపైకి దూసుకొచ్చారు.

Satwik Sairaj : విజయాల హోరు  టైటిళ్ల జోరు!

భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఎక్కువగా సింగిల్స్‌ ఆటగాళ్లదే హవా కనిపిస్తుంది. అయితే డబుల్స్‌లో ఈ లోటును భర్తీ చేస్తూ తెలుగు షట్లర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి/ముంబై కుర్రాడు చిరాగ్‌ షెట్టి అంతర్జాతీయ యవనికపైకి దూసుకొచ్చారు. గోపీచంద్‌ అకాడమీ శిక్షణ కోసం హైదరాబాద్‌ తరలొచ్చిన చిరాగ్‌..ఇక్కడ మన షట్లర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌తో 2016లో జట్టు కట్టాడు. అదే ఏడాది సాత్విక్‌/చిరాగ్‌ టాటా ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌ సొంతం చేసుకొని తమ విజయ ప్రస్థానానికి నాంది పలికారు. ఆ సంవత్సరమే మారిషస్‌ ఇంటర్నేషనల్‌, ఇండియా ఇంటర్నేషనల్‌ సిరీస్‌, బంగ్లాదేశ్‌ ఇంటర్నేషనల్‌, వియత్నాం ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ టోర్నీలలో విజేతలుగా నిలిచారు.

కానీ సాత్విక్‌ ద్వయం అసలు సిసలు సత్తా బయటపడింది మాత్రం 2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో. మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ స్వర్ణ పతకం కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఈ జోడీ..పురుషుల డబుల్స్‌లో రజత పతకం అందుకొని చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న సాత్విక్‌/చిరాగ్‌, నిరుడు భారత జట్టు థామస్‌ కప్‌ పసిడి పతకం సొంతం చేసుకోవడంలోనూ ముఖ్యభూమిక పోషించారు. అలాగే గత కామన్వెల్త్‌ క్రీడల్లో డబుల్స్‌ స్వర్ణంతో అదరగొట్టడంతోపాటు, ప్రపంచ చాంపియన్‌షి్‌ప్సలో కాంస్యంతో మరోసారి చరిత్ర పుటలకెక్కారు. ఇక తాజా విజయంతో వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌..టూర్‌ టోర్నీలలో మొత్తం ఏడు టైటిళ్లు సాత్విక్‌/చిరాగ్‌ సాధించినట్టయింది. మరో రెండు టోర్నమెంట్లలో ఈ స్టార్‌ జంట రన్నర్‌పగా నిలిచింది.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

Updated Date – 2023-07-24T02:49:56+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *