చెన్నై: పుష్కర కాల కెరీర్‌కు శ్రీలంక క్రికెటర్ లాహిరు తిరిమన్నే వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు 33 ఏళ్ల బ్యాటర్ ఆదివారం వెల్లడించాడు. 2010లో అరంగేట్రం చేసిన అతడు 44 టెస్ట్‌లు, 127 వన్డేలు, 26 టీ20లలో ప్రాతినిధ్యం వహించాడు. మూడు టీ20, రెండు వన్డే ప్రపంచ కప్‌లలోనూ పాల్గొన్నాడు.