ప్రపంచ పారా ఆర్చరీలో రజతం కైవసం
న్యూఢిల్లీ: రెండు చేతులు లేకున్నా కాళ్లతోనే బాణాలు సంధిస్తున్న భారత యువ ఆర్చర్ షీతల్ దేవి అంతర్జాతీయ వేదికపై పతకంతో చరిత్ర సృష్టించింది. చెక్ రిపబ్లిక్‌లోని పిజెన్ నగరంలో జరిగిన ప్రపంచ పారా ఆర్చరీ చాంపియన్‌షి్‌పలో రజతం సాధించింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగం ఫైనల్లో షీతల్ 138-140 స్కోరు తేడాతో టర్కీ ఆర్చర్ క్యూరె ఓజ్నర్ చేతిలో ఓటమిపాలై రన్నర్‌పగా నిలిచింది. జమ్ముకశ్మీర్‌కు చెందిన 16 ఏళ్ల షీతల్.. ప్రపంచక్‌పలో పతకం నెగ్గిన చేతులు లేని మహిళా ఆర్చర్‌గా రికార్డు పుటల్లోకెక్కింది.